ఉక్రెయిన్ పై రష్యా యుద్దం తీవ్ర రూపం దాల్చింది. ఉక్రెయిన్ అణుకేంద్రాన్ని ఆక్రమించింది. అయినప్పటికీ ఉక్రెయిన్ సైన్యం దీటుగా స్పందిస్తోంది. లొంగిపోవాలన్న రష్యా సైన్యం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉక్రెయిన్ సేనలు తమ తుదిశ్వాస వరకు పోరాడుతున్నారు. ఎంతో ఆయుధ సంపత్తి ఉండి అత్యాధునిక టెక్నాలజీ వెపన్స్ కలిగిన రష్యాకు ఉక్రెయిన్పై దాడి భారీ నష్టాన్నే మిగిల్చినట్టు తెలుస్తోంది. గత మూడు రోజులుగా జరుగున్న యుద్దంలో ఉక్రెయిన్ సైన్యం తగ్గేదేలే అంటూ తమ సామర్థ్యానికి మించి పోరాడుతోంది.
రష్యా దళాలను ఉక్రెయిన్ సైన్యం ధీటుగా ఎదుర్కొంటున్నట్లు పశ్చిమ దేశాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు సుమారు 3500 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తన ఫేస్బుక్ పేజీలో తాజాగా పేర్కొంది. అంతేకాకుండా మరో 200 మంది రష్యా సైనికులను తాము అరెస్టు చేసినట్లు కూడా గర్వంగా వెల్లడించారు. ఈ క్రమంలో తమ దేశ సైనికులు రష్యాకు చెందిన 14 విమానాలను, 8 హెలికాప్టర్లను, 102 యుద్ధ ట్యాంక్లను, 536 ఆర్మీ వాహనాలను నాశనం చేసినట్టు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది.
కాగా, సైనికుల మృతులకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రష్యా ఇప్పటి వరకు వెల్లడించకపోవడం గమనార్హం. మరోవైపు కీవ్ నగరం వద్ద రష్యా బలగాలకు, ఉక్రెయిన్ సైన్యానికి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవాలన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాల మేరకు ఆ దేశ బలగాలు మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more