అధికార పార్టీలో ఉన్నత పదవిలో కొనసాగుతున్న వ్యక్తులు తమ అధికార పలుకుబడిని వినియోగించుకుని అక్రమార్కుల తాట తీయాల్సిందిపోయి.. స్వయంగా వారే అక్రమాలకు పాల్పడుతూ.. కటకటాల పాలవుతున్నారు. ఇప్పటికే కొత్తగూడెంలోని నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో అధికార పార్టీకి జరగాల్సిన నష్టం కన్నా అధికంగా జరగడంతో ఈ కేసులో వనమా రాఘవను కూడా తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఇక ఈ సమయంలో పార్టీ నేతలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సింది పోయి.. తాము అదే బాటలో నడుస్తామన్నట్లు వ్యవహరించారో మరో పార్టీ ముఖ్యనేత.
రాష్ట్రంలోని ఓ పురపాలకానికి ఢిప్యూటీ చైర్మన్ హోదాలో కోనసాగుతున్న వ్యక్తి అత్యంత నీచానికి పాల్పడ్డాడు. తన బిడ్డ లాంటి మైనర్ బాలికపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. కనీసం చిన్నారి మైనర్ అని కూడా చూడకుండా ఆమెను బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ హింస నెలల తరబడి కొనసాగడంతో అతడి వేధింపులు తట్టుకోలేని బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంచలనంగా మారింది. నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. నిర్మల్ పట్టణం వైఎస్సార్ కాలనీకి చెందిన టీఆర్ఎస్ పార్టీ లీడర్, మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్ అదే కాలనీకి చెందిన 15 సంవత్సరాల బాలిక పై గత కొన్ని రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
డుతున్నాడని నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు. బాధితురాలిని తరచూ బెదిరిస్తూ ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడని వివరించారు. సాజిద్ ఖాన్ వేధింపులు భరించలేక బాలిక శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసిందని చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని డీఎస్పీ వెల్లడించారు. కాగా, నిందితుడు సాజిద్ ఖాన్కు ఓ మహిళ, మరో వ్యక్తి సహకరించాడని తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, అతడిని త్వరలోనే పట్టుకొని రిమాండ్కు తరలిస్తామని డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more