తెలుగు రాష్ట్రాల్లో భూలక్ష్మీ.. ధనలక్ష్మి అవతారం ఎత్తి ఏళ్లైంది. దీంతో కాస్తో కూస్తో కాసులున్న వారి నుంచి బడాబాబుల వరకు అందరూ రియల్ ఎస్టేట్ రంగంపైనే పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య వైరమో లేక భూమి యజమానుల నుంచి సమస్య తీవ్రమైందో తెలియదు కానీ.. ఓ రియల్టర్ కారుపై అగంతకులు జరిపిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కర్ణంగూడ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఘటనాస్థలంలోనే మరణించాగా, మరోక వ్యాపారి రాఘవేందర్ రెడ్డి తీవ్రగాయాలపాలైయ్యాడు.
మంగళవారం ఉదయం చర్లపటేల్గూడ-కర్ణంగూడ మధ్యలో కారులో ఉన్న రియల్టర్లు రఘవేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలపై దుండగులు ఒక్కసారిగా కాల్పుల వర్షం కురిపించారు. వారి కారు రన్నింగ్లో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే కారులో ఒకరు చనిపోయి ఉండటం, మరోకరు సృహకోల్పోయి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గాయపడిన రఘవేందర్ రెడ్డిని చికిత్స నిమిత్తం బిఎన్ రెడ్డినగర్ సమీపంలోని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. సదరు రియల్టర్ అంబర్ పేట్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కాగా మరణించిన శ్రీనివాస్ రెడ్డిది అల్మాస్ గూడ అని పోలీసులు నిర్ధారించారు.
రఘుకు సైతం శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా, సెటిల్మెంట్కి పిలిచి కాల్పులు జరిపినట్లు సమాచారం. పటేల్ గూడలో వేసిన 22 ఎకరాల వెంచర్ పై గొడవ వల్లే కాల్పులు చోటుచేసుకున్నాయని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మట్టారెడ్డి అనే వ్యక్తితో కలిసి శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి వెంచర్ వేశారని, దానిపై కొన్ని నెలలుగా గొడవ జరుగుతోందని చెబుతున్నారు. దాని గురించి సెటిల్మెంట్ చేసుకుందామని మట్టారెడ్డి పిలిచాడని ఆరోపించారు. ఈ క్రమంలోనే బయల్దేరిన శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలపై అతడే కాల్పులకు దిగి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మట్టారెడ్డిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more