ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక పూర్తిస్థాయి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రెండేళ్లకు పైగా ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు ఎట్టకేలకు ఫలించాయి. వారి డిమాండ్లను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వాలు తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోగా.. వారు చేస్తున్న న్యాయపరమైన డిమాండ్ ను గుర్తించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం వారికి సానుకూలమైన తీర్పును వెలువరించింది. ఏడాదిన్నరకు పైగా దీక్షలు అందోళనలతో అట్టుడికిన అమరాతి ప్రాంతంలో ప్రస్తుతం అన్నదాలు సంతోషంతో ఉప్పోంగిపోతున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. అందుకు కారణం ఇవాళ రాష్ట్ర హైకోర్టు అమరావతిపై తీర్పును వెలువరించడమే.
మూడు రాజధానులు, సీఆర్డీఏ అంశంలో ఏపీ హైకోర్టులో దాఖలైన పిటీషన్లపై విచారించిన న్యాయస్థానం కీలక తీర్పు వెలువడించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది. రాజధాని అవసరాలకు తప్ప, వేరే వాటికి భూములు ఇవ్వొదని తెలిపింది. గత ప్రభుత్వాలు రైతులతో కుదుర్చుకున్న ఒప్పంద ప్రకారం ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని ఆదేశించింది. ఆరు మాసాల్లో మాస్టర్ ప్లాన్ ను పూర్తి చేయాలని న్యాయస్థానం అదేశాలిచ్చింది. అంతేగాక, అభివృద్ధి చేసిన ప్లాట్లను మూడు నెలల్లో రైతులకు అప్పగించాలని తెలిపింది.
రైతులకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వడంతో పాటు అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు రాష్ట్ర హైకోర్టుకు నివేదిక సమర్పించాలని పేర్కొంది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ క్రమంలో అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ దాఖలైన సుమారు 75 పిటీషన్లను విచారించిన న్యాయస్థానం ఇవాళ తీర్పును రైతుల పట్ల సానుకూలంగా వ్యవహరించింది. అంతేగాక, పిటిషన్ల ఖర్చు కోసం రూ.50 వేలు ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం కొంతమంది న్యాయమూర్తులు ఈ కేసులు విచారించొద్దని దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
ఇక రైతుల నుంచి సేకరించిన భూములను రాజధాని అభివృద్ది పనులకు మాత్రమే కేటాయించాలని సూచించిన న్యాయస్థానం ఈ భేములను రాజధాని అవసరాల కోసం తప్ప మరే ఇతరాత్ర అవసరాలకు ఈ భూములను తనఖా పెట్టడానికి కూడా వీళ్లేదని స్పష్టం చేసింది. ఇక అమరావతిని సంపూర్ణ రాజధానిగా అభివృద్ది చేయాలని అదేశించిన న్యాయస్థానం.. మూడు నెలల్లోపు వాటాదారులకు ప్లాట్లు నిర్ణయించాలని కూడా తాజాగా అదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లోపు ప్లాట్లకు మౌలిక సధుపాయాలు కల్పించాలని కూడా డిమాండ్ చేసింది. కాగా మాస్టార్ ప్లాన్ లో ఒప్పందాల మేరకు అన్ని అమలు చేయాలని, ఇక అమరావతి నుంచి ఏ ఒక్క కార్యాలయాలన్ని రద్దు చేయకూడదని న్యాయస్థానం అదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more