Cops unearth conspiracy to kill Srinivas Goud మంత్రి హత్యకు అందుకనే ప్లాన్ చేశాం: రాఘవేంద్రర్ రాజు

Accused raghavender raju sensational allegations on minister srinivas goud

V Srinivas Goud, Telangana Excise minister, Raghavendra Raju, Munnuru Ravi, Madhusudhan Raju, Murder conspiracy, tourism minister V. Srinivas Goud assassination, tourism minister V. Srinivas Goud murder attempt, hired assassins, suspects detained in Delhi, minister V. Srinivas Goud murder plot, Jitender Reddy, Telangana, Crime

Cyberabad police foiled the execution of an alleged plan to kill tourism minister V. Srinivas Goud and arrested six persons on Wednesday for hatching the conspiracy and offering Rs 15 crore supari to hired assassins. They seized country-made weapons and other incriminatory documents from them.

శ్రీనివాస్ గౌడ్ పై సంచలన అరోపణలు చేసిన నిందితుడు రాఘవేంద్రర్ రాజు

Posted: 03/03/2022 05:21 PM IST
Accused raghavender raju sensational allegations on minister srinivas goud

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేయడం తెలిసిందే. ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న యాదయ్య, విశ్వనాథ్, నాగరాజులను పేట్ బషీరాబాద్ లో అరెస్ట్ చేయగా, ఈ కేసులో సూత్రధారులుగా భావిస్తున్న ముగ్గురిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఢిల్లీలో బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలోని సర్వెంట్ క్వార్టర్స్ లో రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, మధుసూదన్ రాజులను అదుపులోకి తీసుకున్నారు. వీరు అమరేందర్ రాజు అనే వ్యక్తితో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు రూ.15 కోట్లతో సుపారీ ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడైంది.

కాగా, ఈ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. నిందితుల్లో ఒకరైన రాఘవేంద్రరాజు తన స్టేట్ మెంట్లో మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేసినట్టు కథనాలు వస్తున్నాయి.. తన వ్యాపారాలు దెబ్బతీసి, ఆర్థికంగా తనకు నష్టం చేకూర్చాడని, అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశాడని.. అక్రమంగా కేసులు నమోదు చేయడంతో పాటు తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీశాడని రాఘవేంద్రరాజు అరోపించారు. అంతేకాదు తనకు చెందిన బార్ ను కూడా మూసివేయించిన ఆయన తనపై అక్రమంగా ఎక్సైజ్ కేసులు నమోదు చేయించినట్టు విచారణలో పోలీసులు వివరించాడు.  

శ్రీనివాస్ గౌడ్ 2017 నుంచి తనను చంపించేందుకు ప్రయత్నం చేశారని రాఘవేంద్రరాజు వెల్లడించాడు. తనను అర్థికంగా నష్టపర్చడంతో పాటు తన వ్యాపారాలను కూడా కొనసాగ నీయకుండా చేశాడని అరోపించాడు. తనపై శ్రీనివాస్ గౌడ్ ఎంతలా కక్షగట్టారంటే.. చివరకు తన ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కేంద్రాన్ని కూడా మంత్రి రద్దు చేయించాడని నిందితుడు రాఘవేంద్రరాజు పోలీసులకు వెల్లడించారు. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశారని ఆరోపించాడు. శ్రీనివాస్ గౌడ్ కు మంత్రి పదవి కూడా దక్కడంతో ఆయన వేధింపులు అధికమయ్యాయని చెప్పుకోచ్చారు. దీంతో ఆయన వేధింపులు తారాస్థాయికి చేరుకునే సరికి తాము తట్టుకోలేకనే మంత్రిని హతమార్చాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.

తనపై శ్రీనివాస్ గౌడ్ 30 కేసులు పెట్టించాడని, అందులో 10 కేసులు ఒకే రోజు పెట్టించారని వివరించాడు. వాటిలో ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా ఉన్నాయని తెలిపాడు. రూ.6 కోట్ల మేర ఆర్థికంగా నష్టపరిచాడని పేర్కొన్నాడు. వేధింపులు తట్టుకోలేకనే శ్రీనివాస్ గౌడ్ ను చంపాలని అనుకున్నానని తెలిపాడు. తనకు శ్రీనివాస్ గౌడ్ నుంచి ప్రాణభయం ఉందని రాఘవేంద్రరాజు పేర్కొన్నాడు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర పన్నిన కేసులో ఇప్పటివరకు మొత్తం 8మంది నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles