ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను రక్షించడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ఉక్రెయిన్ నుండి భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడానికి సుప్రీంకోర్టు సీజే ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నించే కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లను ప్రస్తావించారు. అయితే, ఆ పోస్ట్‌లను చూసి తాను ఆశ్చర్యపోయినట్లు జస్టీస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
యుద్ధాన్ని ఆపమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కోరండంటూ ఆ పోస్టులో అభ్యర్థించారనీ, “యుద్ధాన్ని ఆపమని నేను రష్యా అధ్యక్షుడికి ఆదేశాలు ఇవ్వగలనా..?” అని చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను రక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల పట్ల మాకు అన్ని రకాలుగా సానుభూతి ఉందని, భారత ప్రభుత్వం దానికి సంబంధించి చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వం ఇంకా ఏమి చేయగలదో మేము అటార్నీ జనరల్‌ను అడుగుతాము అని ఈ సందర్భంగా జస్టీస్ రమణ అన్నారు.
దీనిపై అత్యున్నత న్యాయస్థానం చేయగలిగింది ఏమైనా ఉంటే తప్పనిసరిగా జోక్యం చేసుకుంటామని వెల్లడించారు. ఇక, ఉక్రెయిన్‌లో దాదాపు 8,000 మంది భారతీయులు, ప్రధానంగా విద్యార్థులు ఇంకా చిక్కుకుపోయారని భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా ఇటీవల తెలియజేశారు. రష్యా సైనిక దాడి కారణంగా ఉక్రెయిన్ గగనతలం ఫిబ్రవరి 24 నుండి మూసివేయడంతో ఉక్రెయిన్ పశ్చిమ పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరి, పోలాండ్ల నుండి భారతదేశం ప్రత్యేక విమానాల ద్వారా భారతీయ పౌరులను స్వదేశానికి తరలిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more