Exgratia claims cross 19 times official deaths in Telangana కరోనా మృతుల కాకిలెక్కల్లో గుజరాత్ తరువాత తెలంగాణే..

Covid 19 31 000 ex gratia claims against 4 100 deaths in telangana

covid death ex gratia, covid death ex gratia in telangana, ex gratia claims in telangana, covid-19, covid deaths in telangana, coronavirus, Telangana, Crime, Corona pandemic deaths, Supreme court on covid death exgratia, Supreme court

Latest data from the Centre shows that the number of people who claimed ex gratia for Covid-19 death in Telangana is almost 10 times the official count of people who died of Covid-19. While state records peg the total deaths at 4,111 (up to March 3), turns out as many as 31,053 filed claims.

కరోనా మృతుల కాకిలెక్కల్లో గుజరాత్ తరువాత తెలంగాణే.. 8 రెట్లు అధికం..

Posted: 03/03/2022 08:16 PM IST
Covid 19 31 000 ex gratia claims against 4 100 deaths in telangana

కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. అయితే దేశంలో మాత్రం రాష్ట్రాల వారీగా అధికారికంగా నమోదు చేసిన మరణాలకు.. అసలు సంభవిస్తున్న మరణాలకు ఎంతో వత్యాసం వుందన్నది జగమెరిగిన సత్యం. కాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కరోనా మృతులకు పరిహారం చెల్లించాలని కేంద్రంతో పాటు రాష్ట్రాలను కూడా అదేశించిన తరుణంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య హఠాత్తుగా పెరిగింది. ఫలితంగా రాష్ట్రాల్లో కరోనా మరణాల అసలు లెక్క దొరికింది. అయితే కరోనా మరణాలను అత్యత్పంగా చూపిన రాష్ట్రాల్లో గుజరాత్ తరువాత తెలంగాణ నిలిచింది.

గుజరాత్ లో ఏకంగా ఒక లక్ష 2వేల మంది కరోనా మృతుల పరిహారం కోసం దరఖాస్తు చేసుకోగా, ఆ తరువాత తెలంగాణ నుంచి ఏకంగా 33 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వ అధికారల లెక్కల ప్రకారం గుజరాత్ లో కేవలం పది వేల 89మంది కరోనా మృతులు నమోదు అవ్వగా, తెలంగాణాలోనూ కేవలం నాలుగు వేల 1 వంద 11 మంది మాత్రమే అధికారిక కరోనా మృతులుగా అధికారులు నమోదు చేశారు. ఇది ప్రభుత్వం ప్రతీ రోజూ చూపిస్తున్న సంఖ్య కంటే ఏకంగా 8 రెట్లు మరణాలు సంభవించినట్టు తేలింది. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,111 మంది మాత్రమే మరణించారని ప్రభుత్వం అధికారిక హెల్త్​ బులెటిన్‌లో పేర్కొన్నది.

కానీ, కొవిడ్ మృతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 28,526 మందికి ఆమోదం ఇచ్చినట్టు​ సర్కార్​ స్వయంగా హైకోర్టుకు ఇచ్చిన నివేదిక ద్వారా వాస్తవిక గణాంకాలు తేటతెల్లం అయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 22 వరకు నష్టపరిహారం రూ. 50 వేల కోసం కొవిడ్ మృతుల కుటుంబాలు 32,844 మంది దరఖాస్తు చేయగా అందులో 2,813 మందిని రిజెక్ట్​చేసినట్టు నివేదికలో తెలిపింది. మరో1,505 మంది అప్లికేషన్లను పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. 28,526 మంది కొవిడ్ కారణంగా చనిపోయినట్టు ప్రభుత్వం పరిగణించడం గమనార్హం. హెల్త్​బులెటిన్‌లో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తున్నట్టు దీని ద్వారా స్పష్టమవుతున్నది.

కరోనా కేసులు, మరణాల విషయంలో ప్రభుత్వం మొదటి నుంచీ తప్పుడు లెక్కలే చూపిస్తున్నది. 28 వేలకు పైగా దరఖాస్తులకు ఆమోదం తెలిపినట్టు ప్రభుత్వం చెబుతున్నా.. ఇప్పటికీ 40 శాతం మందికి డబ్బులు అందలేదని స్వయంగా ఆఫీసర్లే ఆప్​ది రికార్డులో చెబుతున్నారు. డిజాస్టర్​మేనేజ్‌మెంట్, హెల్త్ ఆఫీసర్ల మధ్య సమన్వయం లేకనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నట్టు ఆయా విభాగాల గ్రౌండ్​లెవల్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరిహారం నేరుగా అకౌంట్లలోనే జమ అవుతుందని అధికారులు స్పష్టం చేస్తుండటంతో చేసేదేమీ లేక బాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. వీరిలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల వారే ఉన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌తో చనిపోయిన వారి డెత్ సర్టిఫికేట్ల కోసం బాధిత కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. సరైన డాక్యుమెంట్లు లేనోళ్లు వాటిని సిద్ధం చేసుకునేందుకు మీ సేవా, హాస్పిటల్స్, గ్రామ స్థాయి ఆఫీసర్లు చుట్టూ తిరుగుతున్నారు. అంతేగాక మొదటి వేవ్ సమయంలో తమ సమ్మరీల్లో కరోనా డెత్‌గా రాయొద్దన్నోళ్లూ ఇప్పుడు ఎంట్రీ చేయాలని కోరుతుండటం విశేషం. ప్రైవేట్​ఆస్పత్రులకు ఇలా ఎక్కువ మంది వెళ్తున్నట్టు అధికారులే చెబుతున్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కరోనా మృతుల నష్టపరిహారం కావాలంటే సదరు వ్యక్తి కొవిడ్‌తోనే చనిపోయినట్టు డెత్​సర్టిఫికేట్ సమర్పించడం తప్పనిసరి. ఓడీఎఫ్‌సీ పేరుతో ప్రత్యేక డాక్యుమెంట్‌ను అందజేస్తారు.

దీనిని తీసుకుని మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. దీని​కోసం గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ నుంచి తీసుకున్న డెత్ సర్టిఫికెట్‌తో పాటు పాజిటివ్ రిపోర్ట్‌ ఉండాలి. ఆ రిపోర్టు లేకపోతే ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ఎంసీసీడీ (మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్‌) సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. అదీ లేకపోతే చికిత్స పొందిన సమయంలో తీసుకున్న స్కానింగ్‌లు, టెస్టులు, రిపోర్టులు, మెడికల్​బిల్లులు ఉన్నా దరఖాస్తు చేసుకోవాలి. కానీ మొదటి, రెండో వేవ్‌లలో మరణించిన వారిలో ఎక్కువ మందికి సంబంధించి సరైన డాక్యుమెంట్లు లభించడం లేదు. దీంతో ఆస్పత్రులు, ఆఫీసర్ల చుట్లూ మృతుల కుటుంబాలు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. మరి కొందరు కలెక్టర్​కార్యాలయాల వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles