అదేదో తెలుగు సినిమాలో బస్సు ప్రయాణం చేస్తూ.. ఏంటీ టికెట్ తీసుకుంటారా.? నేను విమానంలోనే తీసుకోను.. మీరు బస్సులో కూడా తీసుకుంటారా..? అంటూ వెటకారం చేసి.. ప్రత్యర్థి వ్యక్తిని పట్టుబడేటట్లు చేసిన జోక్ గుర్తుందా.? సరిగ్గా అదే పని చేసి ఎలా తప్పించుకోవాలో తెలియక పట్టుబడ్డాడు ఓ బుడతడు. ఔనా.. అంటారా.? టికెట్ లేకుండా బస్సు ఎక్కొచ్చు.. రైలు ఎక్కొచ్చు.. కానీ.. విమానం ఎక్కడం కుదురుతుందా? సెక్యూరిటీని దాటుకొని విమానం ఎక్కగలమా? అది అసాధ్యం కదా. కానీ.. ఓ 9 ఏళ్ల బుడతడు దాన్ని సాధ్యం చేశాడు. అవును.. టికెట్ లేకుండా.. విమానం ఎక్కడమే కాదు.. సుమారు 2700 కిమీలు ఆ విమానంలో ప్రయాణించాడు. ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది.
నార్త్‌వెస్టర్న్ బ్రెజిల్‌లోని మానౌస్కు చెందిన 9 ఏళ్ల ఇమ్మాన్యుయేల్ మార్క్వెస్ ఒలివెయిరా అనే 9 ఏళ్ల పిల్లోడి గురించే మనం మాట్లాడుకునేది. ఈ జనరేషన్ పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. టెక్నాలజీని వాడటంలో.. స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడంలో వాళ్ల తర్వాతనే ఎవరైనా. అరచేతిలో వాళ్లకూ ప్రపంచం కనిపిస్తుండటంతో తెలిసీ తెలియని వయసులో ఊహాలోక ప్రపంచంలో విహరిస్తూ ఏదేదో చేసేస్తున్నారు. ఎందుకంటే.. విమానంలో టికెట్ లేకుండా ఎలా ఎక్కాలి? విమాన సిబ్బందికి దొరక్కుండా ఎలా తప్పించుకోవాలి తెలుసుకున్నాడు.
అదెలా అంటే సిబ్బంది కంటపడకుండా విమానంలో ఎక్కడ దాక్కోవాలి? అనే వాటి గురించి ఆ బుడతడు ముందే గూగుల్ చేసి.. అందులో సమాచారాన్ని వెతికి.. దాని ఆధారంగా టికెట్ లేకుండా విమానంలో ప్రయాణించేందుకు పూనుకున్నాడన్నమాట. సావో పాలో స్టేట్‌లోని గౌరుల్ హోస్ అనే సిటీకి వెళ్లే లాటమ్ ఫ్లైట్ ఎక్కిన ఒలివెయిరా అనుకున్నది అనుకున్నట్లు చేశాడు. దాదాపు 2700 కిలోమీటర్లు ఆ విమానంలోనే ప్రయాణించేంత వరకు సిబ్బంది కంటపడకుండా తప్పించుకున్నాడు. అయినా ఎట్టకేలకు విమాన సిబ్బందికి దొరికిపోయాడు.
ఆ తర్వాత బాలుడిని వివరాలు అడిగి విమానం సిబ్బంది.. అతడు విమానం ఎలా ఎక్కడాన్న విషయమై అరా తీశారు. ముందుగా అతడి తల్లిదండ్రుల సమాచారం తెలుసుకున్న సిబ్బంది బాలుడి పేరెంట్స్‌కు సమాచారం అందించారు. అయితే.. ఎలాంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండా.. టికెట్ లేకుండా.. సెక్యూరిటీ చెక్‌ను దాటుకొని ఎలా విమానం ఎక్కాడు.. అనే దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు.. సావో పాలోలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లేందుకే ఆ విమానాన్ని ఎక్కానని ఆ బాలుడు చెప్పడం కొసమెరుపు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more