ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గమధ్యంలో బైకులు, స్కూటర్లు అర్ధంతరంగా ఆగిపోయాయా.? అలాంటప్పుడు ఏం చేస్తాం.? ఈ మధ్యకాలంలో కాసింత అధునాతన టెక్నాలజీ జోడించి కార్లు తయారు చేస్తున్నారు. అంతకుముందు కార్లు కూడా మార్గమధ్యంలో అగిపోయేవి.. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు.? బైకులు, స్కూటర్లు అయితే కాసింత అటు ఇటు వంచి ఆ తరువాత లేపి స్టార్ట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. అప్పటికీ స్టార్ట్ కాకపోతే.. వాటిని తోసుకుంటూ స్టార్ట్ చేసేవాళ్లు. కార్లనే కాదు ఆఖరికి బస్సులు, లారీలను కూడా మార్గమధ్యంలో అగిపోతే ఇలానే తోసి స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించేవాళ్లు.
అచ్చం ఇలాగే కొందరు ప్రయాణికులంతా కలిసి ఒక రవాణా సాధనాన్ని నెట్టుకుంటూ వెళ్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. అయితే ఇది ఏ రవాణ సాధనం అంటారా.. అదే దూమశకటం.. పోగబండి.. బోధపడలేదా.. అదేనండీ రైలుబండి. వామ్మో.. రైలును నెట్టుకుంటూ ప్రారంభించేందుకు ప్రయత్నించారా.? అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. ఇంజిన్ నుంచి ఆ బోగీలను వేరు చేయడానికి కష్టపడుతున్నారు. ఇంతకీ వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారనే కదా మీ డౌటు. రైల్వే ఆస్తులను కాపాడటానికి వీరు కష్టపడ్డారు. రైల్వే ఆస్తులకు వచ్చిన నష్టమేమిటీ అంటారా.?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ వెళ్లడానికి వీరు ఎక్కిన రైలు అగ్నిప్రమాదానికి గురైంది. ఆ రైలు ఇంజిన్, మరో రెండు కంపార్ట్మెంట్లలో మంటలు వ్యాపించాయి. వాటిని చూసి రైలు దిగేసిన ప్యాసింజర్లు.. రైల్వేకు నష్టం కలగకుండా సాయం చేయాలని అనుకున్నారు. అంతే మంటలు మండుతున్న ఇంజిన్, కంపార్ట్మెంట్లను వదిలేసి మిగతా బోగీలను దూరంగా నెట్టుకుంటూ తీసుకెళ్లాడు. ఈ ప్రమాదం షహరాన్పూర్ నుంచి ఢిల్లీ వెళ్లే రైల్లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మంటలు ఎందుకు ప్రారంభమైందీ తెలియడం లేదని, అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదని భారతీయ రైల్వే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వై.కె. ఝా చెప్పారు.
#WATCH | Uttar Pradesh: Fire broke out in engine & two compartments of a Saharanpur-Delhi train, at Daurala railway station near Meerut.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 5, 2022
Passengers push the train in a bid to separate the rest of the compartments from the engine and two compartments on which the fire broke out. pic.twitter.com/Vp2sCcLFsd
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more