పాకిస్థాన్ ఉగ్రచర్యలు రోజురోజుకూ శృతిమించిపోతున్నాయి. ఓ వైపు దేశంలోకి అక్రమంగా ఉగ్రవాదులను చొరబడేందుకు నిత్యం ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్.. మరోవైపు దేశంలోని కీలకమైన ప్రాంతాలపైకి డ్రాన్ లను పంపుతూ దాడులు చేస్తోంది. శనివారం రోజున జమ్మూ-కాశ్మీర్ లోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో ఒక డ్రోన్ ను భారత భద్రతా బలగాలు పేల్చివేసిన తరువాత కూడా కుక్క తోక వంకర అన్న చందంగా తన వక్రబుద్దిని మార్చుకోని పాకిస్థాన్ ఇవాళ వేకువజామున మరో డ్రోన్ ను దేశంలోకి చోచ్చుకెళ్లేలా ప్రయోగించింది. కాగా భారత సరిహద్దు దళాలు అ డ్రోన్ ను పేల్చివేశాయి.
తాజాగా ఇవాళ వేకువ జామున పంజాబ్ ఫిరోజ్‌పుర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో భార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు (బీఎస్ఎఫ్) పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చివేశాయి. వేకువ జామున సుమారు 3.00 సమయంలో పాకిస్థాన్ వైపు నుంచి దేశంలోకి చోచ్చుకోస్తున్న డ్రోన్ ను గాలి తెన్నెరలను చీల్చుకుంటూ వస్తుండడంతో ఆ శబ్దానికి అప్రమత్తమైన బీఎస్ఎఫ్ జవాన్లు.. దానిని గుర్తించేందుకు గాలిలో పారా బాంబులను పేల్చారు. దీంతో ఆ ప్రాంతమంతా వెలుగులతో ప్రకాశవంతంగా మారింది. దీంతో డ్రోన్ ను టార్గట్ చేసిన బీఎస్ఎఫ్ జవాన్లు దానిని కూల్చివేశారు.
కాగా ఈ డ్రోన్ ను ఆ వెలుగులలో గమనించినప్పుడు.. దానికి ఓ ఆకుపచ్చ వర్ణంలోని బ్యాగు తగిలించివుందని తెలిపారు. అందులో 4కేజీల నిషేధిత వస్తువులు ఉన్నట్లు బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆకుపచ్చ సంచి ఉందని, అందులో పసువు రంగులో నాలుగు ప్యాకెట్లు, ఓ నలుపు వర్ణంతో కూడిన చిన్న ప్యాకెట్ కూడా వుందని వెల్లడించారు. ఈ ఫ్యాకెట్ల మొత్తం బరుపు 4 కేజీల 17 గ్రాములు ఉందని అన్నారు. నల్లని ప్యాకెట్లో చుట్టిన ప్యాకెట్ బరువు మాత్రం 250గ్రాములుగా వుందని తెలిపారు. జమ్మూలోని సరిహద్దులో పాకిస్తన్ డ్రోన్ కూల్చిన 24 గంటలు కూడా గడవకముందే ఈ ఘటన జరగడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more