Priest attacks devotee at Secunderabad Ganesh temple సికింద్రాబాద్ గణపతి ఆలయంలో ‘‘రౌడీ పూజారీ’’..

Priest attacks devotee at secunderabad ganesh temple cctv footage

Priest attacks devotee, Priest attacks devotee in secundrabad, Priest attacks devotee at Ganesh temple, priest Prabhakara sharma attacks devotee, priest attacks devotee valmiki rao, Ganesh Temple, Secunderabad, Priest attacks devotee, Prabhakar Sharma, Valmiki Rao, Ministry of Temples, Telangana, Crime

In a shocking incident, a priest attacked a devotee and the video is creating a buzz on the internet. The incident took place at Ganesh Temple in Secunderabad on February 27. According to the reports, the priest identified as Prabhakar Sharman and he yelled and attacked at Valmiki Rao citing he entered the prohibited area of the temple.

ITEMVIDEOS: సికింద్రాబాద్ గణపతి ఆలయంలో ‘‘రౌడీ పూజారీ’’.. భక్తుడిపై దాడి

Posted: 03/07/2022 04:59 PM IST
Priest attacks devotee at secunderabad ganesh temple cctv footage

సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ లో ఓ పెద్దవయస్కుడైన భక్తుడికి పరాభవం ఎదురైంది. ఆలయం పూజారి పెద్దవాడన్న కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా ఆయనపై దాడి చేశారు. దైవదర్శనం కోసం ఆలయంలోకి వెళ్లిన భక్తుడిపై పూజారి అమర్యాద వ్యవహరించి.. చేయిచేసుకుని, దాడికి పాల్పడిన ఘటన అలస్యంగా వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులకు పిర్యాదు చేసిన భక్తుడు ఆలయ పూజారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో అసలు విషయం బయటకు పోక్కింది. దీంతో పోలీసులు పూజారిపై కేసు నమోదు చేశారు.

ఈ ఘటనకు చెందిన సీసీటీవీ ఫూటేజీలను పోలీసులు పరిశీలించడంతో ఆ దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ సిసిటీవీ ఫూటేజీలు నెట్టింట్లో, సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారాయి. అనుమతి లేకుండా ఆలయంలోకి వెళ్లడం ఆ పెద్ద వయస్సులోని భక్తుడి పాలిట శాపంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. రెండ్రోజుల క్రితం గణపతి ఆలయానికి వచ్చిన ఉప్పల్‌కు చెందిన వాల్మీకి రావు అనే భక్తుడు వచ్చి దైవదర్శనం చేసుకున్నాడు. సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్ లోని వినాయకుణ్ని దర్శించుకున్నాడు. ఆ తరువాత పక్కనే ఉన్న ఉప ఆలయాలను కూడా దర్శించుకున్నాడు.

ఈ సమయంలో పూజారి ప్రభాకర్ శర్మ భక్తుడైన వాల్మీకీ రావుతో ఘర్షణకు దిగాడు. అనుమతి లేకుండా ఆ గుడిలోకి ఎలా వెళ్తావంటూ.. ఆగ్రహానికి లోనై భక్తుడిపై దాడి చేశాడు. పెద్ద వయస్కుడైన భక్తుడు వాల్మీకి రావు ఆయన నుంచి తప్పించుకుని పక్కకు రాగా.. మళ్లీ ఆయన వద్దకు వచ్చిన పూజారీ ప్రభాకర శర్మ.. మరోసారి దాడి చేశాడు. ఈ దాడిలో అదుపు తప్పిన భక్తుడు వాల్మీకిరావు కిందపడిపోయాడు. వెంటనే ఆలయసిబ్బంది సహా భక్తులు అక్కడకు చేరుకుని ఏమైందని ఆరా తీశారు. ఇక భక్తులు అందరూ ఒక్కసారిగా వచ్చినా.. వెనక్కుతగ్గని ప్రభాకర శర్మ.. అనుమతి లేకుండా ఆలయంలోకి వచ్చాడని భక్తులకు చెప్పాడు.

ఈ దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. భక్తుడు పోలీసులను ఆశ్రయించడంతోపాటు.. ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. దేవాదాయశాఖ కమిషనర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ప్రభాకర్ శర్మపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.వస్తున్నారంటూ భక్తులపై పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పూజారి ప్రభాకర్ శర్మ భక్తులతో వాగ్వాదానికి దిగారు. పూజలు చేసి భక్తులను ఆశీర్వదించాల్సిన పూజారే రౌడీ మాదిరిగా దాడి చేయడం దారుణమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంబంధిత పూజారీని కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles