బీజేపి ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేతపై స్పీకరే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. రేపటితో సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో సస్పెన్షన్ కు గురైన బీజేపి ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యేందుకు అనుమతించాలని.. రేపు ఉదయం స్పీకర్‌ను కలవాలని తెలంగాణ హైకోర్టు ధర్మాసనం సూచించింది. రాజకీయాలకు అతీతంగా శాసనసభాపతి తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రశ్నించే వారూ సభలో ఉండాలని అభిప్రాయపడింది.
బీజేపి ఎమ్మెల్యేల సస్పెన్షన్ వ్యవహారంపై తుది నిర్ణయం శాసనసభ స్పీకర్దేనని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. దీంతో బీజేపి ఎమ్మెల్యేలు కోరినట్లు వారి సస్పెన్షన్‌పై స్టే ఇవ్వలేమని ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపి ఎమ్మెల్యేలు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ కు అప్పీలు చేశారు. అత్యవసర విచారణ చేపట్టాలని జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి ధర్మాసనాన్ని ఈ ఉదయం కోరారు. అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు నోటీసులను తీసుకోవడం లేదని బీజేపి ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ప్రకాష్‌రెడ్డి తెలిపారు.
తాజాగా నోటీసులు జారీచేసిన ధర్మాసనం.. అసెంబ్లీ కార్యదర్శికి అందచేయాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్ ను హైకోర్టు ఆదేశించింది. అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు స్పష్టం చేసింది. దీంతో అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు అందచేసినట్లు సాయంత్రం 4 గంటలకు జ్యుడీషియల్ రిజిస్ట్రార్ హైకోర్టుకు తెలిపారు. అయితే అసెంబ్లీ కార్యదర్శి తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాది హాజరు కాలేదు. సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధంగా, శాసనసభ నియమావళికి వ్యతిరేకంగా ఉందని బీజేపి ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది వాదించారు. తమ పేర్లను ప్రస్తావించకుండానే మంత్రి సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారన్నారు.
సస్పెన్షన్‌పై సభాపతికి అధికారాలు ఉంటాయని.. అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు కోర్టులకు పరిమితంగా అధికారాలు ఉంటాయని ధర్మాసనం పేర్కొంది. అయితే బీజేపి ఎమ్మెల్యేలు స్పీకర్నే కలసి.. సమావేశాలకు హాజరయ్యేందుకు తమకు అనుమతిని ఇవాలని కోరాలని ధర్మాసనం సూచించింది. సభ్యులను స్పీకర్‌కు కలిపించాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. సమస్య పరిష్కారానికి పార్టీలకు అతీతంగా సభాపతి తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more