Telangana SSC, Inter exams rescheduled తెలంగాణ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

Telangana ssc inter exams rescheduled new exam dates here

ssc exams, telangana, telangana ssc exams, telangana tenth class exams, telangana tenth exams, SSC public examinations, 10th class exams, Telangana Inter exams, telangana intermiediate exams, Telangana Board of Intermiediate, Telangana ssc board, TSBIE

Due to the rescheduling of JEE (Main)-2022 examinations and intermediate examinations, the SSC public examinations for May-2022 tentatively rescheduled from May 23 to June 1 between 9:30 am to 12:45 pm.

తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు

Posted: 03/16/2022 06:05 PM IST
Telangana ssc inter exams rescheduled new exam dates here

తెలంగాణలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 23 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. సర్వసాధారణంగా ప్రతీ ఏడాది మార్చిలో జరగాల్సిన పరీక్షలు కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో కొన్ని నెలల పాటు విద్యాసంస్థలు అన్ని అన్ లైన్ తరగతులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులకు ఇంటర్నెట్ సమస్యలు ఏర్పడ్డాయి.

దీంతో తరగతులను మళ్లీ విద్యార్థులకు బోధించి.. వారు పరీక్షలకు సిద్దమయ్యేందుకు గాను రెండు నెలల అదనపు సమయాన్ని కేటాయించారు. ఈ క్రమంలో ఇప్పటికే జేఈఈ మెయిన్స్ పరీక్షలతో పాటు ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా రీ-షెడ్యూల్ అయ్యాయి. దీంతో ఈ ఏడాది వార్షిక పరీక్షలు మార్చికి బదులుగా ఈ ఏడాది మే నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక దీనికి తోడు ఈసారి పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులకు కాసింత ఊరట కల్పించనుంది బోర్డు అప్ సెకండరీ ఎడ్యుకేషన్.

గతంలో చాయిస్ ఐదింటిలో మూడు, లేదా మూడింటిలో రెండు రాసేలా అప్షన్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ సారి పరీక్షలలో విద్యార్థులకు మరింత ఊరట కల్పించేలా యాభై శాతం మేర చాయిస్ అప్షన్ ఇవ్వనుంది. ధియరీ విభాగంలోని ఈ మేరకు 50 శాతం ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాసే అప్షన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేష‌న్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఉద‌యం 9:30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల వరకు పరీక్షలు జరగనున్నట్లు స్పష్టం చేసింది.

మే 23(సోమ‌వారం) – ఫ‌స్ట్ లాంగ్వేజ్
మే 24(మంగ‌ళ‌వారం) – సెకండ్ లాంగ్వేజ్
మే 25(బుధ‌వారం) – థ‌ర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్‌)
మే 26(గురువారం) – గ‌ణితం
మే 27(శుక్ర‌వారం) – భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం
మే 28(శ‌నివారం) – సాంఘిక శాస్త్రం
మే 30(సోమ‌వారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-1
మే 31(మంగ‌ళ‌వారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-2
జూన్ 1(బుధ‌వారం) – ఎస్ఎస్సెసీ ఒకేష‌నల్ కోర్సు (థియ‌రీ). ఉద‌యం 9:30 నుంచి 11:30 వ‌ర‌కు

అటు తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీపై క్లారిటీ వచ్చేసింది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 6వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మొదలు కానుండగా.. 7వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంతకుముందు ఏప్రిల్ 22 నుంచి పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. కానీ జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. ఏప్రిల్ 21 నుంచి మే4వ తేదీ వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో ఇంటర్ పరీక్షల తేదీల్లో బోర్డు మార్పులు చేసింది.ఇక ఇంటర్ పరీక్షల రీ-షెడ్యుల్ ఇలా..

ఇంటర్ ఫస్ట్ ఇయర్ టైంటేబుల్ ఇలా

మే 6 (శుక్రవారం) - సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
మే 9 (సోమవారం) - ఇంగ్లీష్ పేపర్ పేపర్ 1
మే 11 (బుధవారం)- మ్యాథ్స్ పేపర్ 1ఎ, బాటనీ, పోలిటికల్ సైన్స్ పేపర్ 1
మే 13 (శుక్రవారం)- మ్యాథ్స్ పేపర్ 1ఎ, జువాలజీ, హిస్టరీ పేపర్ 1
మే 16 (సోమవారం)- ఫిజిక్స్, ఎకానమిక్స్ పేపర్ 1
మే 18 (బుధవారం)- కెమిస్ట్రీ, కామర్స్  పేపర్ 1
మే 20 (శుక్రవారం)- పబ్లిక్ అడ్మిన్సష్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్(బైపిసీ విద్యార్థులకు) పేపర్ 1
మే 23 (సోమవారం)- మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పేపర్ 1

ఇంటర్ సెకెండ్ ఇయర్ టైంటేబుల్ ఇలా

మే 7 (శనివారం) - సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
మే 10 (మంగళవారం) - ఇంగ్లీష్ పేపర్ పేపర్ 2
మే 12 (గురువారం)- మ్యాథ్స్ పేపర్ 2ఎ, బాటనీ, పోలిటికల్ సైన్స్ పేపర్ 2
మే 14 (శనివారం)- మ్యాథ్స్ పేపర్ 2ఎ, జువాలజీ, హిస్టరీ పేపర్ 2
మే 17 (మంగవారం)- ఫిజిక్స్, ఎకానమిక్స్ పేపర్ 2
మే 19 (గురువారం)- కెమిస్ట్రీ, కామర్స్  పేపర్ 2
మే 21 (శనివారం)- పబ్లిక్ అడ్మిన్సష్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్(బైపిసీ విద్యార్థులకు) పేపర్ 2
మే 24 (మంగళవారం)- మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పేపర్ 2

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles