హిజాబ్‌తోనే తాము విద్యాలయాలకు వస్తామంటూ భీష్మించిన ఉడుపి ముస్లిం విద్యార్థినులు అన్నంత పనీ చేశారు. విద్యాలయాల్లోకి హిజాబ్‌ను అనుమతించరాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆ విద్యార్థినులు.. హిజాబ్‌ను అనుమతించేదాకా క్లాసులకు వెళ్లబోమంటూ మంగళవారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న చెప్పిన మాట ప్రకారమే బుధవారం నాడు వాళ్లంతా క్లాసులకు డుమ్మా కొట్టారు. అంతేకాకుండా తాము హాజరుకావాల్సిన పరీక్షలకు కూడా వారు గైర్హాజరయ్యారు.
తమను హిజాబ్‌తో పాఠశాలలోకి రానివ్వలేదంటూ ఉడుపి జిల్లాకు చెందిన ఆరుగురు ముస్లిం విద్యార్ధినులు నేరుగా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఒక్క కర్ణాటకనే కాకుండా యావత్తు దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు.. విద్యాలయాల్లోకి హిజాబ్‌కు అనుమతి లేదని తేల్చేసింది. ఈ తీర్పు తమకు న్యాయం చేయలేదని వ్యాఖ్యానించిన విద్యార్ధినులు హిజాబ్‌ను అనుమతించేదాకా తాము క్లాసులకే హాజరు కాబోమంటూ పేర్కొన్నారు. అంతేకాదు, హైకోర్టు తీర్పును వారు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి కూడా తెలిసిందే.
కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదంపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిరాకరించింది. హోలీ సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని ఓ విద్యాలయం యాజమాన్యం హిజాబ్‌తో వచ్చిన విద్యార్థులను నిలిపేసింది. హిజాబ్ తీసేసి.. స్కూల్ డ్రెస్‌తో మాత్రమే విద్యాలయంలోకి ప్రవేశించాలని ఆదేశించింది. దీనికి నిరాకరించిన విద్యార్థులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో హిజాబ్‌ను విద్యాలయాల్లో నిషేధించాలంటూ మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
దీంతో ఈ పిటిషన్లన్నింటినీ కలిపి హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ వివాదంపై మంగళవారం కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించింది. విద్యాలయాల్లోకి హిజాబ్‌ను అనుమతించడానికి వీల్లేదంటూ కోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుతో తమకు న్యాయం జరగలేదని భావించిన విద్యార్థులు మంగళవారమే సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దీనిపై అత్యవసర విచారణ అవసరం లేదని, హోలీ సెలవుల తర్వాత విచారణ చేపడతామని తేల్చి చెప్పింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more