పార్లమెంట్ సమావేశాలను కూడా గతేడాది స్థంభింపజేసిన పెగసెస్ స్పైవేర్ అంశం ఇప్పుడు రాజకీయాల్లో మరోమారు ప్రకంపనలు సృష్టిస్తోంది. తమ ప్రత్యర్థి పార్టీ నేతల ఫోన్ కాల్స్‌పై నిఘా ఉంచేందుకు పెగాసస్ స్పైవేర్‌ను టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు సంధించారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ.. తాము ఎప్పుడూ ఎలాంటి స్పైవేర్ కొనుగోలు చేయలేదని.. మమతాబెనర్జీ చేసిన అరోపణలను తీవ్రంగా ఖండించారు.
పెగాసస్ ఆఫర్ ను మా ప్రభుత్వం తిరస్కరించిందని ఇప్పటికి స్పష్టంగా తెలిసిపోయిందని చంద్రబాబు నాయుడు అన్నారు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేసుకున్న కర్నూలు వాసి కాపీలను ఆయన చూపించారు. ఈ ప్రచారం ద్వారా తనను, టీడీపీని అప్రతిష్టపాలు చేసేందుకేనని అరోపించారు. ఈ ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతున్నట్లు స్పష్టమవుతోందని చంద్రబాబు పేర్కోన్నారు. తమపై తమ పార్టీపై కావాలనే అరోపణలు సంధిస్తున్నారని.. నిరాధార అరోపణలు చేయడం సహేతుకం కాదని ఆయన సూచించారు.
కర్నూలు జిల్లా యెమ్మిగనూరుకు చెందిన కోనేరు నాగేంద్ర ప్రసాద్, పెగాసస్ స్పైవేర్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసిందో లేదో తెలుసుకోవడానికి 2021 జూలై 25న RTIకి దరఖాస్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరించిన సాఫ్ట్వేర్ ఏదీ లేదని అధికారులు సమాధానమిచ్చారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ.. "మేం ఎప్పుడూ ఎలాంటి స్పైవేర్‌ను కొనుగోలు చేయలేదు. ఎలాంటి అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడలేదు. ఆమె నిజంగా అలా మాట్లాడిందో, ఎక్కడ, ఏ సందర్భంలో చెప్పిందో నాకు తెలియదు. ఒకవేళ ఆమె అలా చెబితే, ఆమెకు తప్పు సమాచారం ఉంది" అని అన్నారు. .
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు పెగాసస్ స్పైవేర్‌ను ఆఫర్ చేశారని, ప్రజల గోప్యతను పరిగణనలోకి తీసుకుని తాను ఆ ప్రతిపాదనలను వ్యతిరేకించానని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఈ స్పైవేర్ ఉందని ఆమె పేర్కొన్నడంతో అది కాస్తా సంచలనంగా మారింది. దీంతో టీడీపీపై విమర్శల వర్షం కురిసింది. అయితే అది సత్యదూరమని.. ఏపీ ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్‌ను ఎప్పుడూ కొనుగోలు చేయలేదని ఆర్టీఐ ఆధారాలను టీడీపీ నేతలు షేర్ చేశారు. అలాంటి స్పైవేర్లు ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్యను టీడీపీ అడ్డుకునేదని ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more