ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు (CRPF jawans) గాయపడ్డారు. సుక్మా జిల్లాలోని ఎల్మగుండ క్యాంప్‌పై సోమవారం ఉదయం 6 గంటల సమయంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ చెప్పారు. అయితే మెరుగైన చికిత్స నిమిత్తం వారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా రాయ్ పూర్ కు తరలించామని చెప్పారు.
కాగా కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ హేమంత్ చౌధరి, కానిస్టేబుళ్లు బసప్ప, లలిత్ బాఘ్ గాయపడ్డారని చెప్పారు. అయితే వీరిందరి అరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వెల్లడించారు. వీరందరూ సీఆర్పీఎఫ్ రెండో బేటాలియన్‌కు చెందిన వారని తెలిపారు. సీఆర్పీఎఫ్ జవాన్లు ఈ మధ్యే ఎల్మగుండలో క్యాంప్ ఏర్పాటు చేశారని తెలిపారు. మావోయిస్టుల దాడి నేపథ్యంలో ఈ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశామన్నారు. మావోయిస్టులు కాల్పులు జరపడమే కాకుండా స్థానికంగా తయారైన గ్రెనేడ్లను కూడా విసిరినట్లు అక్కడ ఉన్న అధికారులు తెలిపారు.
ఈ సంవత్సరం ఫిబ్రవరి ప్రారంభంలో ఏర్పాటు చేసిన ఎల్మగుండ శిబిరం మార్చి 18న హోలీ మిలన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది, ఈ సందర్భంగా సమీపంలోని గ్రామాలకు మందులు, ఇతర వినియోగాలు పంపిణీ చేశామని, గ్రామస్తులను కూడా భద్రతా సిబ్బంది భోజనాలు ఆహ్వానించారని. దీంతో వారు ఈ దాడికి పాల్పడినట్టు తెలిపారు. కాగా రెండేళ్ల క్రితం ఎల్మగుండ నుంచి తిరిగి వస్తుండగా మావోయిస్టులు మెరుపుదాడి చేయడంతో మినపాలో 17 మంది డీఆర్జీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి మినప, ఎల్మగుండలో సీఆర్పీఎఫ్ శిబిరాలు మావోయిస్టులకు వ్యతిరేకంగా దూకుడుగా సాగుతున్నాయని సీనియర్ అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more