ఐదు నెలల తరువాత అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన క్రూడ్ అయిల్ ధరలు ఫలితంగా ఐదు నెలల అనంతరం ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా ఇంధన ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో చమురు సంస్థలు ఇవాళ అటు పెట్రోల్ సహా డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఇకపై ఇంధన ధరలను పెంచేది లేదని, ధరల పెంపుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని బీరాలు పోయిన కేంద్ర ప్రభుతం.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వరుసగా ఇంథన దరలను పెంచూతూ వచ్చిన విషయం తెలిసిందే.
ఈ తరుణంలో దేశంలో ఎన్నడూ లేని విధంగా ఇంధనధరలు రోజురోజుకూ కొత్త శిఖరాలను చేరుకున్నాయి. దేశంలో రెండోదశ కరోనా విజృంభన కొనసాగుతున్నా.. అనేక రాష్ట్రాలలో లాక్ డౌన్ అములులో వున్నా తమ ధరలకు మాత్రం ఎక్కడా చెక్ పెట్టలేదు ఇంధన సంస్థలు. గత ఏడాది మే నెలలో 13వ సార్లు ఇంధన ధరలను పెంచూతూ నిర్ణయం తీసుకున్నాయి, ఫలితంగా పలు రాష్ట్రాలలో ఇంధన ధరలు రూ. 100 మార్కును అధిగమించాయి. ఇలా అప్రతిహాతంగా పెరుగుతూ పోతున్న ధరల నేపథ్యంలో కేంద్రం వాహనదారులపై కరుణ చూపాలన్న డిమాండ్లు పెరగడంతో ఎట్టకేలకు ఎక్సైజ్ సుంకాన్ని కాసింత తగ్గించి ఊరట కల్పించింది.
ఈ క్రమంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు అప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు వరకూ పెంచాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే రోజురోజుకు చమురు సంస్థల నష్టాలు పెరుగుతుండడంతో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం అనివార్యంగా మారినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరికొన్ని రోజుల పాటు చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...
ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 95.41గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 86.67కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర 109.98గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 94.14కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర 101.40గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 91.43కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర 104.67గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 89.79కు చేరింది.
అమరావతి గుంటూరులో పెట్రోల్ ధర రూ, 111.47 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 96.88కు చేరింది.
విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర 109.05గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 95.18 కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 109.10, గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 95.49కు చేరింది.
దేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పెట్రోల్ ధర ఏకంగా వంద మార్కును చేరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more