బీజేపి నేతలను, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల బీజేపి అధ్యక్షులను వారితో పాటు సాక్ష్యాత్తు ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కూడా ఏ చిన్న అవకాశం దొరికినా చాలు దానిని సద్వినియోగం చేసుకుంటారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. ఇటీవల ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంపై ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్ జనుల నుంచి మిశ్రమ స్పందనలు లభించాయి. ది కాశ్మీర్ ఫైల్స్ పై అనుకూల, ప్రతికూల వర్గాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో అసలు కాశ్మీర్ వాస్తవిక ఘటనపై రూపోందించిన ఈ చిత్రాన్ని కేంద్రంతో పాటు బీజేపి పాలిత రాష్ట్రాలు కూడా పలు మినహాయింపులు ఇస్తున్న క్రమంలో ప్రకాష్ రాజ్ తన సహజ ధోరణిలో వేసిన విమర్శలు నెటిజనులను ఆకర్షించాయి.
అప్పట్లో ఏం జరిగిందన్న వాదనల్లో కొందరు ఒకలా, మరికొందరు మరోలా చెబుతున్నారని.. అయితే ఈ నేపథ్యంలో వచ్చిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంపై ఆయన సునిశిత అస్త్రాలను సందించారు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో కాశ్మీర్ పండితులపై అప్పట్లో జరిగిన అరచకాలపై చిత్రం రూపోందించడంతో ఆ ద్వేషాలను తిరిగి రాజేస్తున్నారా..? ఆ బాధిత గుండెలను ఈ చిత్రం ఊరడించేలా ఉందా.? లేక ఆ గుండెలలో విషపు బీజాలు నాటేలా వుందా.? అని ప్రశ్నించారు, దీనికి తన ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ జస్ట్ ఆస్కింగ్ ను జోడించడంతో ఇది నెట్ జునులలో కూడా ఆలోచనలను రగిలించింది. ఇక తాజాగా మహారాష్ట్ర బీజేపి అధ్యక్షుడితో పాటు ప్రధాని మోదీని కూడా సెటైరికల్ గా ప్రశ్నించారు ప్రకాశ్ రాజ్.
ఇటీవల మహారాష్ట్ర బీజేపి అధ్యక్షుతు చంద్రకాంత్ పాటిల్ ప్రధాని మన్ననలను పోందేందుకు.. ప్రధాని మోడీ దేశ అభ్యున్నతి కోసం రోజుకు రెండు గంటలే నిద్రపోతారని, ఒక రోజులో 22 గంటల పాటు ఆయన పనిచేస్తుంటారని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ‘దయచేసి కొంచెం కామన్సెన్స్ ఉపయోగించండి. నిద్రపోలేకపోవడం అనేది ఓ జబ్బు. వైద్య పరిభాషలో దీన్ని ఇన్సోమ్నియా అంటారు. దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు. ఆ జబ్బుతో బాధపడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించండి’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్గా మారింది. కాగా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రకాశ్ రాజ్ ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పిస్తుంటాడనే విషయం విధితమే.
Please have some common sense… not able to sleep is a medical condition called INSOMNIA.. it should be treated .. not bragged about . please take care of your leader #justasking pic.twitter.com/CPj7rP7F6Z
— Prakash Raj (@prakashraaj) March 22, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more