Petrol, diesel rates up by ₹1.60 a litre in two days వరుసగా రెండో రోజు పెరిగిన ఇంధన దరలు..

Petrol diesel price hiked for the second consecutive day petrol crosses 110 mark in telugu states

Petrol Diesel prices, petrol diesel price hike, petrol prices in delhi, diesel prices in delhi, effect of covid 19 on petrol prices, effect of covid 19 on diesel prices, petrol price, petrol rate, petrol rate today India, diesel rate, diesel price, diesel rate today, diesel rate today in India, today petrol rate, today diesel rate, Petrol rate in Hyderabad, diesel rate in Telangana, diesel rate in Andhra Pradesh, diesel rate in Hyderabad, diesel rate in Guntur, diesel rate in Chennai, diesel rate in Vijayawada, diesel rate in Amaravati, diesel rate in Visakhapatnam, diesel rate in Delhi, diesel rate in Chennai, diesel rate in India, Petrol rate in Telangana, petrol rate in Andhra Pradesh, petrol rate in Delhi, petrol rate in Mumbai, Petrol rate in Hyderabad, Petrol rate in Visakhapatnam, fuel rates today in India, fuel rates, fuel price in India

Petrol and diesel become costlier by ₹1.60 per litre in two days as state-run oil companies on Wednesday raised their rates by 80 paise a litre for the second consecutive day even as the international oil prices remained flat on Tuesday. Benchmark Brent crude fell marginally at $115.48 a barrel compared to $115.62 the previous day. State-run fuel retailers say they align domestic retail prices daily with their respective benchmarks of the previous day.

వరుసగా రెండోరోజు పెరిగిన ఇంధన దరలు.. వాహనదారులు దిగులు..

Posted: 03/23/2022 12:33 PM IST
Petrol diesel price hiked for the second consecutive day petrol crosses 110 mark in telugu states

ఇంధన ధరల విషయంలో గత ఆరేళ్లుగా కేంద్రం ప్రకటనలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. గత ఎన్నికలకు ముందు ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే విషయమై కేంద్రం ఆలోచిస్తుందని చెప్పుకోచ్చిన అప్పటి కేంద్ర పెట్రోలియం శాఖామాత్యులు ధర్మేంద్ర ప్రధాన్.. ఆ తరువాత అందుకు రాష్ట్రాలు అంగీకరించడం లేదని చేతులెత్తేశారు. ఈ గతేడాది జరగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు.. ఇకపై పెంచేది లేదని, ధరల పెంపుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పినా.. ఫలితాల ప్రకటనకు ముందే ధరలు పెరగడంతో అవి నీటిమూటలేనని తేలిపోయాయి. ఇక తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఐదు నెలల పాట పెంపుకు స్వస్తి పలికిన ఇంధన సంస్థలు.. ఇక మళ్లీ వరస వాయింపులకు సిద్దమయ్యాయి.

ప్రభుత్వ చమురు కంపెనీలు ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. అయితే ఇన్నాళ్లు ముఫై పైసలు, లేదా 40 వరకు పెంచిన సంస్థలు.. తాజాగా ఏకంగా 90 పైసల మేర పెంచుతుండటం గమనార్హం. ఇక ఇవాళ కూడా దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు రెండూ పెరిగాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్‌ లీటర్‌కు 90 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 84 పైసల వరకూ పెంచాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గరిష్టానికి చేరుకుని వాహనదారులను కలవరపెడుతున్నాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ. 96.21కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 87.47కు పెరిగింది.

తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...

ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 96.21గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 87.47కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర 110.82గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 95.00కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర 102.16గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 92.19కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర 105.51గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 90.62కు చేరింది.
అమరావతి గుంటూరులో పెట్రోల్ ధర రూ, 112.08 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 98.10కు చేరింది.
విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర 110.93గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 96.40కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 110.00గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 96.36కు చేరింది.
బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర 101.42 నమోదు కాగా, డీజిల్‌ ధర రూ. 85.80 పైసలకు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  Diesel  fuel price  petrol price  diesel price  hyderabad  visakhapatnam  coronavirus  covid-19  

Other Articles