కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తుల కొంగు బంగారమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి భక్తులకు.. కరోనాకు ముందునాటి పరిస్థితులను తీసుకురావడంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే శ్రీవారి దర్శన టోక్లను పూర్తిస్థాయిలో పెంచిన టీటీడీ.. ఇక అర్ఝిత సేవలను కూడా ప్రత్యక్షంగా నిర్వహించేందుకు చర్యలను చేపడంతో పాటు మూడు నెలల వరకు అన్నింటినీ బుక్ చేసుకునేలా భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కరోనా మహమ్మారికి పూర్వవైభవం తీసుకువస్తుండంతో భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే భక్తుల సంఖ్య పెరడంతో పాటు శ్రీవారి దర్శనాలకు కూడా సమయం బాగా పెరుగుతున్న క్రమంలో కరోనాకు ముందు వడ్డించినట్లుగా వెయింట్ హాళ్లలో భక్తులకు ఆహారం, పాటు అందించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను అదేశించారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఆయన శుక్రవారం స్లాట్ సర్వదర్శనం క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. దర్శనం కోసం వెళ్తున్న భక్తులతోనూ ఆయన మాట్లాడారు.
దర్శనానికి వేచిఉండే సమయంలో తాగు నీరు, మరుగు దొడ్ల సదుపాయాలు సరిగా ఉన్నాయా లేదా అని క్యూ లో దర్శనానికి వెళుతున్న భక్తులను అడిగి తెలుసుకున్నారు. క్యూ లైన్ల నిర్వహణ పరిశీలించారు. సర్వదర్శనం ఎంత సమయంలో అవుతోందని అధికారులను అడిగారు. ఉదయం అయితే గంటన్నర లోపు, సాయంత్రం 6 గంటల తరువాత వారికి రెండు గంటల్లో అవుతోందని అధికారులు తెలిపారు. క్యూ లైన్ లో భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని వీజీవో బాలిరెడ్డి ని ఆదేశించారు.
దుబాయ్ లో నివాసం ఉంటున్న చార్టెడ్ అకౌంటెంట్ ఎం. హనుమంత కుమార్ శుక్రవారం టీటీడీ కి రూ. కోటి విరాళంగా అందించి స్వామివారిపై ఉన్న భక్తిని చాటుకున్నారు. ఈ మేరకు ఈరోజు తిరుమల లోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి డీడీని అందజేశారు. టీటీడీ అభీష్టం మేరకు ఈ సొమ్ము ఏ ట్రస్ట్ కైనా జమచేసుకోవాలని దాత కోరారు. అదేవిధంగా సికింద్రాబాదుకు చెందిన శ్రీ పద్మావతి సొల్యూషన్స్ అధినేత శ్రీధర్, టీటీడీ గో సంరక్షణ ట్రస్ట్ కు రూ.10,1116 విరాళంగా అందించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more