సోషల్ మీడియా పుణ్యమా అని పెళ్లి వీడియోలు కూడా ఈ మధ్యకాలంలో తెగ వైరల్ అవుతున్నాయి. నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా.. అంటూ వచ్చిన పాటను ఓ నవ వధులు తన పెళ్లి భరాత్ లో ఎంచుకుని దానిపై డాన్స్ వేయడంతో పాటతో పాటుగా నవజంట కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యారు. ఇలా అనేక వివాహ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఆ మధ్యకాలంలో పెళ్లికూతరు డాన్స్ వేయబోతుండగా.. వరుడు లాగి చెంపపై కొట్టిన వీడియో కూడా అదే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పెళ్లి వేడుక అంటే వధువరుల తరపు బంధువులు, కొత్త పరిచయాల మధ్య చాలా సరదాగా, సంతోషంగా సాగిపోతున్న వేడక.. వీరితో పాటు నవజంట స్నేహితులు కూడా హాజరై తమ మిత్రుల పెళ్లిలోని కీలక ఘట్టాలను తమ సెల్ ఫోన్లలో బంధిస్తుంటారు. దీంతో ఈ మధ్య పెళ్లిళ్లలో ఏం జరిగినా అది వెంటనే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంది. అలాంటి వాటిలో తాజాగా ఓ వివాహక వేడుకలో జరిగిన సన్నివేశం కూడా నెట్టింట భారీగా వైరలవుతోంది. ఫన్నీగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇదేదో సామాన్యమైన పెళ్లి కాదండీ ఏకంగా ఇద్దరు సెలబ్రిటీలది.
ఇక వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బాలీవుడ్ నటీ అన్షుల్ చౌహాన్ వివాహం సినీమాటోగ్రాఫర్ అతీత్ తో జరిగిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ వీడియో అమె పెళ్లిలోనే అనగా గత ఏడాది నవంబర్ 21న దేశరాజధాని న్యూఢిల్లీలో జరిగింది. కాగా ఈ వీడియోను ఇటీవల విట్టీ వెడ్డింగ్స్ అనే ఇన్టాగ్రామ్లో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. అయితే, ఈ వేడుకలో వధూవరులు నిలబడ్డారు. ఆ సమయంలో ఓ పాట ప్లే అయ్యింది. దీంతో వధువు డ్యాన్స్ చేసింది. వరుడిని కూడా తనతోపాటు డ్యాన్స్ చేయాలని చేతులందించిది. కానీ, వరుడు సిగ్గుపడుతూ పక్కకు జరిగి అలా ఆమెను చూస్తూ నవ్వుతాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ భారీగా వైరల్ చేస్తూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
View this post on Instagram
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more