ఐఏఎస్ టాపర్ గా నిలిచిన టీనా దాబీ గుర్తుందా..? 2015లో జరిగిన పరీక్షలలో టాపర్ గా నిలవడమే కాకుండా.. తనతో పాటు మరో టాపర్ గా నిలిచిన అధర్ అమీర్ ఖాన్ ను వివాహం చేసుకుని ఆ తరువాత కొన్ని రోజులకే విడిపోయారు. దీంతో మళ్లీ ఒంటరైన అమె తాజాగా రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఈ సారి కూడా అమె ఐపీఎస్ అధికారినే పెళ్లి చేసుకోబోతున్నారు. 2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ గవాండేను ఆమె పెళ్లాడబోతున్నారు. తమ నిశ్చితార్థం ఫొటోలను టీనా, ప్రదీప్ ఇద్దరూ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఫొటోల్లో వీరిద్దరూ చేతుల్లో చేతులు వేసుకుని, చిరునవ్వులు చిందిస్తుండటం అందరినీ ఆకట్టుకుంటోంది.
2018లో టీనా దాబి తొలి వివాహం జరిగింది. ఐఏఎస్ అధికారి అత్తర్ ఖాన్ ను ఆమె పెళ్లాడారు. అప్పట్లో వీరి ప్రేమ, పెళ్లి గురించి దేశ వ్యాప్తంగా ఎన్నో కథనాలు వచ్చాయి. వార్తా పత్రికల్లో హెడ్ లైన్స్ లో వీరు నిలిచారు. 2015 యూపీఎస్సీ పరీక్షల్లో టీనా దాబి తొలి ర్యాంకు సాధించగా, అత్తర్ ఖాన్ రెండో ర్యాంకు సాధించారు. యూపీఎస్సీ టాపర్ గా నిలిచిన తొలి దళిత వ్యక్తిగా టీనా చరిత్ర సృష్టించారు. అంతేకాదు, ఫస్ట్ అటెంప్ట్ లోనే సివిల్స్ ను టీనా క్రాక్ చేశారు. టీనా, అత్తర్ లకు ముస్సోరిలోని ఐఏఎస్ అకాడమీలో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ రాజస్థాన్ కేడర్ కు చెందిన వారు. వీరి పెళ్లి జమ్మూకశ్మీర్ లోని పెహల్గామ్ లో అట్టహాసంగా జరిగింది.
ఢిల్లీలో జరిగిన వివాహ విందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎందరో సీనియర్ పొలిటీషియన్లు, అత్యున్నత అధికారులు హాజరయ్యారు. అయితే కొంత కాలం తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. తన పేరు చివరన ఖాన్ అనే పేరును ఆమె తొలగించడంతో విషయం బహిర్గతమయింది. 2021 ఆగస్ట్ 10న వీరికి జైపూర్ లోని ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేసింది. ఇప్పుడు ప్రదీప్ గవాండేను టీనా పెళ్లాడబోతున్నారు. టీనా కంటే ప్రదీప్ సర్వీస్ పరంగా రెండేళ్లు సీనియర్. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ ఆర్కియాలజీ మరియు మ్యూజియంల డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more