ఇంధన ధరలపై కేంద్రం ద్వంద విధానాలను అవలంభిస్తోంది. ముందు ఒకలా వెనుక మరోలా ఉంది. ఓ వైపు ఇంధన సంస్థలకు ధరలను రోజురోజుకు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూనే.. ఇంధన ధరలలో కేంద్రం విధించే పన్ను చాలా తక్కువని, ఇక రాష్ట్రాల పన్నుభారమే బేసిక్ ఇంధన ధరల కన్నా ఎక్కువగా ఉందని ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా చేసుకుంటూ పోతోంది. అయితే ఇంధన అమ్మకాలపైనే రాష్ట్రాల పన్ను ఆయా రాష్ట్రాలకే పరిమితం. అయితే దేశంలోని ప్రతీ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాలను కలిపితే కేంద్రం పన్ను పడుతుందన్న విషయం తెలిసిందే. ఇలా రాష్ట్రాల వారీగా అమ్మకాల వివరాలు తీసి.. లెక్కలు వేసి.. ఒక్క ఏడాదిలో ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయల లాభాన్ని అర్జించింది కేంద్రమా.? లేక రాష్ట్రాలా..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఈ విషయాలను పక్కనబెడితే.. ఐదు రోజుల వ్యవధిలో నాలుగు సార్లు ఇంధన ధరలు పెరిగాయి. దీంతో గత ఆరేళ్లుగా కేంద్రం ప్రకటనలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. గత ఎన్నికలకు ముందు ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే విషయమై కేంద్రం ఆలోచిస్తుందని చెప్పుకోచ్చిన అప్పటి కేంద్ర పెట్రోలియం శాఖామాత్యులు ధర్మేంద్ర ప్రధాన్.. ఆ తరువాత అందుకు రాష్ట్రాలు అంగీకరించడం లేదని చేతులెత్తేశారు. ఈ 2021లో జరగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు.. ఇంధన ధరలను పెంచేది లేదని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పినా.. ఫలితాల ప్రకటనకు ముందే ధరలు పెరగడంతో అవి నీటిమూటలేనని తేలిపోయాయి.
ఇక తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఐదు నెలల పాట పెంపుకు స్వస్తి పలికిన ఇంధన సంస్థలు.. ఇక మళ్లీ వరస వాయింపులకు సిద్దమయ్యాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. దీంతో వారం రోజుల వ్యవధిలో ఏకంగా ఆరుసార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఇక తాజాగా పెట్రోల్ పై 30 పైసలు డీజిల్ పై 0.35 పైసల మేర పెంచుతుండటం గమనార్హం. ఇక ఇవాళ కూడా దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు రెండూ పెరిగాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెంపుతో అటు డీజీల్ ధర కూడా వంద మార్కుకు చేరువలో పయనిస్తోంది. గత ఆరు పర్యాయాల పెంపుతో ఇంధన ధరలు రూ.3.50 మేర పెరిగాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ. 99.41కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 90.77కు పెరిగింది.
తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...
ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 101.81 గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 93.07కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర 116.72గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 100.96కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర 107.45గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 97.52కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర 111.35గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 96.22కు చేరింది.
అమరావతి గుంటూరులో పెట్రోల్ ధర రూ, 117.32 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 103.10కు చేరింది.
విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర 117.00గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 103.00కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 115.42గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.101.58కు చేరింది.
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర 107.30 నమోదు కాగా, డీజిల్ ధర రూ. 91.27 పైసలకు చేరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more