మైనర్ బాలిక సమ్మతంతోనే అమెతో శృంగారంలో పాల్గోన్నా అది అత్యాచారం కిందకే వస్తుందని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మైనర్ బాలికల అమాయక తత్వాన్ని లోబర్చుకుని.. లేదా ఏదైనా అశలు చూపించి ఇలాంటి చర్యలు జరగడం కొత్తేమీ కాదని, ఇక బాలికల ఇష్టంతోనే ఆమెతో శృంగారంలో పాల్గొన్నామని చెప్పడం ధాటవేత ధోరణే అవుతుందని, ఇలాంటి ఘటనలు కూడా అత్యాచారమే అని.. వాటని అత్యాచారం కింద కేసులు నమోదు చేసి.. వారిపై పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేయాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
బంజారాహిల్స్ లో నివసించే బంధువుల ఇంటికి వచ్చిన బంధువు వారింట్లోని 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఈ కేసులో బాలిక అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతిచ్చిన కోర్టు.. బాలికకు గర్భం తీస్తే అమె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న విషయాన్ని తెలియజేయాలని, అందుకు బాలితో పాటు అమె తల్లిదండ్రులు కూడా సమ్మతిస్తే ఆలస్యం చేయకుండా గర్భాన్ని తొలగించాలని వైద్యులకు సూచించింది. కాగా బాలిక ఇష్టపూర్వకంగానే బంధువుతో వెళ్లినా, లైంగికంగా కలిసినా అది అత్యాచారం పరిధిలోకే వస్తుందని పేర్కొంది.
గర్భం దాల్చిన కారణంగా మైనర్ బాలిక వ్యక్తిగత పరువుతో జీవించే హక్కు కోల్పోతుందని, శారీరకంగాను, మానసికంగాను ఆమెపై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి వరకు చదువుకుంది. ఖమ్మం జిల్లాలో ఉన్న వివాహితుడై ఇద్దరు పిల్లలు ఉన్న బంధువు (26) వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చాడు. తన పనులను చక్కెబెట్టుకుంటూనే ఇతర సమయంలో బాలికతో చనువుగా వ్యవహరించాడు. ఈ క్రమంలో బాలిక ఇంటికి వచ్చిన అతడితో సన్నిహితంగా మెలిగింది.
బాలిక తల్లిదండ్రులు పనులకు వెళ్లిన సమయంలో ఆమెను బయటకు తీసుకువెళ్లి, బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. వారింట్లోనూ బాలికను పలుమార్లు లోంగదీసుకున్నాడు. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత నిందితుడు ఖమ్మం వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా బాలిక అసలు విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మరోవైపు, బాలిక గర్భం దాల్చడంతో దానిని తొలగించేందుకు బాలిక తల్లిదండ్రులు నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, బాలిక అప్పటికే 20 వారాల గర్భిణి కావడంతో తొలగించడం ఆమె ఆరోగ్యానికి ప్రమాదకరమని చెబుతూ గర్భాన్ని తొలగించేందుకు నిరాకరించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు తన బిడ్డ కడుపులో పెరుగుతున్న శిశువును తొలగించేందుకు వైద్యులను అదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా బాలికపై ఆమె సమ్మతితోనే శృంగారం చేసినా.. అది అత్యాచారమేనని న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక బాలిక గర్భాన్ని తొలగించేందుకు అనుమతినిచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more