కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తన ఆస్తినంతా రాసిచ్చింది ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కి చెందిన ఓ మహిళ. తన తదనంతరం రాహుల్ కు ఆస్తి దక్కేలా వీలునామాను కోర్టుకు సమర్పించింది. తన ఆస్తికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని వారసుడిగా రాసిచ్చింది 78 ఏళ్ల వృద్దమహిళ. నగరంలోని నెహ్రూ కాలనీకి చెందిన మేఘరాజ్ కుమార్తె పుష్ప మంజీలాల్ తన పేరుపై ఉన్న మొత్తం ఆస్తులను రాహుల్ గాంధీకి ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన వీలునామా పత్రాలను కోర్టులో సమర్పించింది. రాహుల్ గాంధీ ఆలోచనలు తనను బాగా ప్రభావితం చేశాయని.. ప్రస్తుతం దేశానికి రాహుల్ గాంధీ లాంటి నేతల అవసరం చాలా ఉందని అన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి నేటి వరకు గాంధీ కుంటుంబం దేశం కోసం అత్యున్నత త్యాగాలను చేసిందని తెలిపింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలోచనలతో ప్రభావితమయ్యే తన ఆస్తికి వారసుడిగా ఎంపికచేసినట్లు మహిళ తెలిపింది. ఆమెకు సంబంధించిన ఆస్తి పత్రాలు సహా ఇతర పత్రాలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రీతమ్సింగ్కు అందజేసినట్లు ఆ పార్టీ మెట్రోపాలిటన్ అధ్యక్షుడు లాల్‌చంద్ శర్మ తెలిపారు. తన తదనంతరం ఆస్తి మొత్తాన్ని రాహుల్ గాంధీకి అప్పగించాలని పుష్ప.. కోర్టును అభ్యర్థించింది.
పుష్ఫ మంజీలాల్ తన పేరుపై రూ.50 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు, 10 తులాలల బంగారం ఉన్నట్లు సమాచారం. స్వతంత్రా భారతావనిలో పేదల కోసం అలోచించి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమేనని, దేశంలోని పేదలు రెండు పూటలా అన్నం తినేలా ఆహారభద్రతా పథకాన్ని తీసుకువచ్చింది కూడా అదే పార్టీ అని అమె పేర్కోన్నారు. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీ దేశానికి ప్రధానమంత్రులుగా సేవలందించారు. రాహుల్ తల్లి సోనియా గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండగా.. ఆయన సోదరి ప్రియాంక గాంధీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more