పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు వారి విధులు నిర్వహించకుండా ఆటంకం కలిగించినందుకు భోలక్ పూర్ ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భోలక్ పూర్ పరిధిలో అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో దుకాణాలు, హోటళ్లు తెరచివున్న నేపథ్యంలో పోలీసలు వాటిని బంద్ చేయిస్తుండగా వారిని అడ్డుకుని విధులకు ఆటకం కలిగించడంతో పాటు.. వారిపై దుర్భాషలాడిన ఎంఐఎం కార్పోరేటర్ గౌసుద్దీన్ తాహకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ కావడంతో.. వాటిపై స్పందించిన కేటీఆర్.. కార్పోరేటర్ పై చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు. దీంతో కదిలిన పోలీసులు అతడ్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ఇందుకు సంబంధించిన వీడియోలను బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు నెటిజనులు రాష్ట్రమంత్రి కేటీఆర్, డీజీపి మహేందర్ రెడ్డీల కు ట్యాగ్ చేసి.. ఇలాంటివారిపై చర్యలు చేపట్టగలరా.? అని కామెంట్ చేశారు. దీంతో ఈ వీడియోలపై ట్విటర్ వేదికగా స్పందించిన కేటీఆర్.. పోలీసులపై ఇలాంటి జులం తెలంగాణలో కొనసాగదని కామెంట్ చేసిన కేసీఆర్ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భోలక్‌పూర్ కార్పొరేషన్ గౌసుద్దీన్ పై సెక్షన్ 350, 506 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.
కాగా ముషీరాబాద్‌లోని భోలక్‌పూర్ ప్రాంతం స్లమ్ ఏరియా అని అక్కడ 24 గంటల పాటు దుకాణాలను రంజాన్ మాసంలో తెరిచే ఉంచాలని స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పోలీసలు అధికారులకు విన్నవించారు. రెక్కడితే కానీ డొక్కాడని జీవులు ఉదయం నుంచి రాత్రి వరకు పనులు చేసుకుని.. రాత్రి పూట వెసలుబాటు చేసుకుని పండగకు షాపింగ్ చేస్తుంటారని, వారి కోసం దుకాణాలను రంజాన్ మాసంలో 24 గంటల పాటు తెరచుకునే వెసలుబాటు కల్పించాలని కోరారు. లేని పక్షంలో ఇదే అంశం పెద్ద సమస్యగా కూడా మారే అవకాశముందని.. ఈ విషయంలో పోలీసులు సంయమనం పాటించాలని కోరారు.
అయితే ఎమ్మెల్యే ముఠా గోపాల్ దుకాణాదారులపై పోలీసులు దౌర్జన్యం చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని అనగా.. పోలీసులనే వారు బెదిరిస్తున్నారని అవతలి వ్యక్తి (పోలీసు అధికారి) చెప్పారు. దీంతో దానిని సమర్ధించుకునే క్రమంలో పోలీసులు ఇబ్బందులను తట్టుకోలేక వారు తిరగబడుతున్నారే తప్ప.. పోలీసులు వెళ్లకపోతే సమస్యే లేదని ఆయన చెప్పడం కొసమెరుపు. ఈ వీడియోను బీజేపి జాతీయ ఉపాధ్యక్షుడు కె లక్ష్మణ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేయడంతో అది కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక కేటీఆర్ ఆదేశాలను కూడా ఆయన పార్టీ ఎమ్మెల్యే పట్టించుకోరా.. భోలక్ పూర్ లో దుకాణాలను 24 గంటలు తెరచివుంచాలని అదేశాలను ఇస్తన్న స్థానిక ఎమ్మెల్యే అంటూ ట్వీట్ చేశారు.
A clear warning to @hydcitypolice not to enter his area for the next 30 days & abusing the officers on duty.
— Raja Singh (@TigerRajaSingh) April 5, 2022
Too much freedom leads to this.
The video is from the Musheerabad area of Hyderabad city, @CPHydCity can we expect some action against such people. @TelanganaDGP pic.twitter.com/Am9dniF83E
TRS #Musheerabad MLA is giving orders to police department not to stop any shops from closing in Bholakpur area within #Musheerabad Assembly.
— Dr K Laxman (@drlaxmanbjp) April 6, 2022
Who is at fault for yesterday's incident? KTR, Hyderabad Police, or MLA? pic.twitter.com/RwEeND67G6
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more