స్నేహితుడి పెళ్లంటే ఇక అతని కుటుంబసభ్యుల కన్నా ఎక్కువ హడావిడి చేసేది అతని స్నేహితులే. పెళ్లికి ముహూర్తం ఫిక్స్ కాగానే బంధువులందరికీ పెళ్లి పత్రికలు ఇవ్వడం నుంచి పెళ్లిపనులు, బాజాభజంత్రీలు, అయ్యావార్లు, వంటవాళ్లు, ఇలా ఒక్కటని కాకుండా అన్నిపనులు వారే కష్టపడి మరీ చేస్తారు. ఇక పెళ్లిరోజున కూడా రాత్రంతా బరాత్ వేడుకల్లో పాల్గోని.. మరుసటి రోజున మళ్లీ విందు కార్యక్రమానికి యస్ వీ ఆర్ హియర్ అంటూ సిద్దంగా ఉంటారు. అయితే వరుడి స్నేహితులు పెళ్లిలో కానుకలు ఇవ్వకుండా విందు రోజున కానుకలు ఇస్తుంటారు.
ఇక మరీ కావాల్సిన స్నేహితులైతే.. మరి ఎక్కువ చనువు తీసుకుని వింత వింత కానుకులను కూడా అందిస్తుంటారు. ఇక మరికొందరు కేక్ తీసుకువచ్చి కట్ చేయిస్తుంటారు. మరికొందరు మంచి కాస్ట్లీ చాకెట్లను ప్యాక్ చేయించి అలా ఒక్క బాక్సు తరువాత మరో బాక్సులో పెటి ప్యాక్ చేయించి వధూవరులు విసుగుచెందేలా కూడా చేయిస్తుంటారు. ఇలా తమకు తోచిన విధంగా స్నేహితులు తమ కానుకలను ఇస్తుంటారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన ఓ యువకుడికి పెళ్లి జరిగింది. ఆ తరువాతి రోజున రిసెప్షన్ లో అతని స్నేహితులు వచ్చి కానుకను అందించి దానిని వేదికపైనే తెరవాల్సిందిగా కోరుతారు.
దీంతో వరుడు కానుక కవర్ చింపేందుకే ప్రయాస పడటంతో అతడి స్నేహితులలో ఒకరు.. ఓసోసి.. పెళ్లి గిప్ట్ ప్యాక్ ఓపెన్ చేయడం రావట్లేదు కానీ ఏకంగా పెళ్లి చేసుకుంటున్నాడు అని కామంట్ చేశారు. ఇది విన్న వధువు నవ్వు ఆపుకోలేకపోతోంది. అయినా వరుడు మాత్రం దానిని పట్టించుకోకుండా కానుకను తెరిచేపనిలో నిమగ్నమయ్యాడు. ఇక తీరా ఓపెన్ చేసి చూస్తే.. అందులో విసనకర్రలు ఉన్నాయి. ఒకటి వదువుకు మరకటి వరుడికి అందించారు. ఇక రాత్రింబవళ్లు ఒకరికోకరు ఎంచక్కా విసురుకోండి అని చమత్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ కోరత, తీవ్రత అధికంగా వున్న నేపథ్యంలో ఈ కానుకను అందించడం వధూవరులతో పాటు వారి బంధువులకు కూడా ఆశ్చర్యపర్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more