ఫిలిప్పీన్స్‌పై మరోమారు ప్రకృతి పగబట్టింది. సాలీనా ఏడాదికి 20 వరకు తుపాన్లను ఎదుర్కోనే ఫిలిఫైన్స్ నాలుగు నెలల క్రితమే రాయ్ తుపాను బీభత్సం సృష్టించింది. ఈ రాయ్ తుఫాను ధాటికి దేశంలో ఏకంగా 400 మంది అసువులుబాసారు. ఇక తాజాగా మేగీ తుఫాను ప్రకోపాన్ని చాటుతోంది. దీని ప్రభావంతో గత కోన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తుడటంతో పాటు.. వరదలు కూడా వచ్చాయి. ఈ ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడి.. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు ఏకంగా 67 మంది మృత్యువాత పడగా, వందలాది మంది గల్లంతయ్యారు.
అయితే ఈ సంఖ్య మరింతగా పెరగొచ్చని అధికారులు తెలిపారు. ఓ వైపు తుపాను, మరోవైపు వర్షాలు, ఇంకోవైపు వరదులు, ఇది చాలదన్నట్లు కొండచరియలు ఇలా అన్ని కలసి తమ దేశప్రజలపై ఒకేసారి పంజావిసరగడంతో రాయ్ తుపాను మిగిల్చిన విషాదం కన్నా అధికంగానే మేగి తుపాను ప్రళయం సృష్టిస్తోందని దేశప్రజలు అంటున్నారు. ప్రస్తుతం మేగి తుపాను సృష్టిస్తున్న భీభత్సంతో అనేక గ్రామాల్లో విఫాదఛాయులు నెలకోన్నాయి. వర్షం నీటిలో భూమి పట్టతప్పడంతో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. కొండచరియలు విరిగిపడటంతో సహాయక చర్యలకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరోవైపు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.
సెంట్రల్ లేటె ప్రావిన్సులోని బేబే నగరంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ కొండచరియలు విరిగిపడటంతో వంద మందికి పైగా గాయపడ్డారు. వరదల దాటికి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. లెయిటే రాష్ట్రంలోని బేబే నగరంలో పరిస్థితి విషాదంగా ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అబుయోగ్ మునిసిపాలిటీలో భాగమైన పిలార్ తీరప్రాంత గ్రామంలో 13 మంది మరణించారు మరియు సుమారు 150 మంది తప్పిపోయారు, బురద మరియు మట్టి ఇళ్ళను సముద్రంలోకి నెట్టివేసి, చాలా స్థావరాన్ని పూడ్చిపెట్టినట్లు అబుయోగ్ మేయర్ లెమ్యూల్ ట్రాయా తెలిపారు.
కొండచరియలు విరిగిపటడంతో పర్వత ప్రాంతాలవాసులతో పాటు లోతట్టు ప్రాంతాలవాసులను కూడా స్థానిక పునరావాస శిబిరాలకు తరలించామని, అయితే తాము వినియోగించే ఫబర్ గ్లాస్ పడవల రాకపోకలకు నీటిలోని ఉక్కు బార్లు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలను కల్పిస్తున్నాయని నేసనల్ డిజాస్టర్ అధికారులు తెలిపారు. బేబే సిటీ వారాంతంలో వ్యవసాయ స్థావరాలలోకి దూసుకెళ్లిన నేల అలలు కనీసం 67 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇరవై ఏడు మంది గల్లంతయ్యారని అన్నారు.
పీకల లోతు నీటిలోనూ అధికారులు సహాయక చర్యలను చేపడుతున్నారు. కోస్టల్ గార్డు అధికారి ఓకరు మెడలోని నీటిలో నడుస్తూ నీటిలో మునిగిపోయిన మృతదేహాల కోసం అన్వేషిస్తున్నారు. ఇక మరికొందరు కోస్టల్ గార్డు అధికారులు వరదలతో ఇళ్లు మునిగిపోయినా.. అక్కడే ఉంటున్న నిర్వాసితులను బోట్లలో శిభిరాలకు తరలించారు. పిలార్లో బాధితుల కోసం మరిన్ని బోట్లు అవసరమని అబుయోగ్ పోలీస్ చీఫ్ కెప్టెన్ జేమ్స్ మార్క్ రూయిజ్ తెలిపారు. కానీ ఒడ్డుకు చేరుకోవడం మాత్రం కష్టంగా మారింది. ఫిలిఫిన్స్ పై తుపాన్లు ప్రకోపాన్ని నిత్యం చాటుతుంటాయి. వర్షకాలంలో తుపాన్లు అధికంగా ఏర్పడి పిలిఫైన్స్ ను అల్లకల్లోం చేస్తుంటాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more