డాల్ఫిన్లు మనుషులతో త్వరగా కలుస్తాయి. మనుషులను త్వరగా అన్వయించుకుంటాయి. వారు ఎలా చేస్తే అలా చేయాలని ప్రయత్నిస్తుంటాయి. ఇక వాటికి చక్కగా ట్రైనింగ్ ఇస్తే.. ఇంకా బహుచక్కగా మనుషుల మాదిరిగా ప్రవర్తించేందుకు దోహదపడతాయి. అందుకనే వీటిని పలు దేశాల్లో ఆకర్షణీయ ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. అయితే తొలిసారి ఓ డాల్పిన్ కు పట్టరాని కోపం వచ్చింది. అంతే అది నీటిలోనే తన ట్రైనర్ పై తిరగబడింది. ఇది గమనించిన ట్రైనర్ నీటిలోంచి బయటకు రాగా.. డాల్పిన్ వెంటనే దాడి చేసింది. దీంతో ఆ ట్రైనర్‌తోపాటు ప్రదర్శన చూస్తున్న వారంతా షాకయ్యారు. అమెరికాలోని మయామి సీక్వేరియంలో చోటుచేసుకున్న ఈ ఘటన యావత్ డాల్పిన్ ప్రేమికులను విస్మయానికి గురిచేసింది.
అదేంటి డాల్పిన్లు మనుషులపై దాడి చేశాయా.? అంటూ విస్తుపోయారు. డాల్ఫిన్ షోను చాలా మంది సందర్శకులు, మరీ ముఖ్యంగా చిన్నారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రదర్శనల సందర్భంగా అవి అడే ఆటలను చూస్తూ.. మైమర్చిపోతారు చిన్నారులు. కానీ అలాంటి డాల్ఫిన్ ఉన్నట్టుండి కోపంతో శిక్షకురాలిపై దాడి చేసిందన్న వార్తను మాత్రం నమ్మశక్యంగా లేదని అంటున్నారు. ఈత కొలనులో ఈదుతున్న శిక్షకురాలి మీదకు పలుమార్లు డాల్పిన్ దూసుకువచ్చింది. దీంతో ఆ ట్రైనర్ పూల్ ఒడ్డుకు వేగంగా చేరింది. దీంతో డాల్పిన్ కూడా నీటిలోంచి నేరుగా ట్రైనర్ కాలిపై దూసుకువచ్చి దాడి చేసింది. వెంటనే ఆ మహిళా ట్రైనర్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆమె పెద్దగా గాయపడలేదని పార్క్ నిర్వాహకులు తెలిపారు. డాల్ఫిన్ ‘సన్‌డ్యాన్స్’ ప్రవర్తన వింతగా ఉందని, రొటీన్‌కు భిన్నంగా అది ప్రవర్తించి ట్రైనర్‌పై దాడి చేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ఆ షోలో పాల్గొన్న ఒక వ్యక్తి తన మొబైల్లో రికార్డు చేసిన వీడియోను పెటా సంస్థ ట్విట్టర్లో షేర్ చేసింది. డాల్ఫిన్లను బంధించి వాటితో షోలు నిర్వహించడాన్ని వ్యతిరేకించింది. డాల్ఫిన్లను నిర్బంధిస్తే అవి ఎప్పటికైనా ఎదురు తిరుగుతాయని, హాని తలపెడతాయని పేర్కొంది. కాగా, ట్రైనర్‌పై డాల్ఫిన్ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా పలురకాలుగా స్పందించారు.
BREAKING: This chilling video shows a dolphin attacking a trainer, tossing her body violently through the water, & reportedly sending her to the hospital.
— PETA (@peta) April 12, 2022
Time is up for @MiamiSeaquarium—it must send the animals to seaside sanctuaries! pic.twitter.com/YN27DGygZe
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more