కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి వి హనుమంత రావు ఇంటిపై గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. గురువారం తెల్లవారుజామున అంబర్ పేటలోని తన ఇంటిపైకి ఆగంతకులు రాళ్లు రువ్వారు. తన ఇంటి ఎదుట పార్క్ చేసిన కారును ధ్వంసం చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తన కారును ధ్వంసం చేసినవారిపై గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తనకు భద్రత కల్పించాలని తాను స్వయంగా రాష్ట్ర డీజీపికి పిర్యాదు చేసినా.. భధ్రత కల్పించలేదని అన్నారు.
హెచ్చరికలను తేలిగ్గా తీసుకుంటోన్న పోలీసులు జరగరాని ఘటనలు జరిగిన తరువాత చర్యలు తీసుకోవడం కంటే.. ముందుస్తుగానే భద్రతా ఏర్పాట్లు చేస్తే.. బాగుంటుందని హితవు పలికారు. ఇవాళ ఉదయం వీహెచ్ తన కారును పరిశీలించారు. ఈ ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా ఖండించారు. హనుమంతరావుతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో సీనియర్ నేతలకే భద్రత కల్పించలేని విధంగా వ్యవస్థ తయారైందని ఆయన దుయ్యబట్టారు. తక్షణం వీహెచ్ కారును ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.
హనుమంతరావుకు పోలీసు భద్రత కల్పించాలని డిమాండ్ రేవంత్ డిమాండ్ చేశారు. ఇక పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీహెచ్ కారు ధ్వంసం చేసిన ఘటనలో ఓ 18 ఏళ్ల హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి అమీర్పేట నివాసం బయట పార్క్ చేసిన వీ హన్మంతరావు కారును ధ్వంసం చేసిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వీహెచ్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన సిసిటీవీ ఫూటేజీలను పరిశీలించిన పోలీసులు సదరు యువకుడినే నిందితుడిగా పేర్కోంటూ అదుపులోకి తీసుకున్నారు.
యూపీలోని బరేలీకి చెందిన 18 ఏళ్ల యువకుడు ఆగి ఉన్న కారును పదే పదే కొట్టి, కిటికీలు పగలగొట్టి ధ్వంసం చేసినట్లు సీసీటీవీ విజువల్స్ చూపిస్తున్నాయి. నిందితుడు వీహెచ్ పొరుగునే గత ఆరు నెలలుగా అతని స్నేహితులతో కలసి ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో కారును ధ్వంసం చేశాడు. అయితే వీహెచ్ కారును ధ్వంసం చేయాడానికి గల కారణాలను పోలీసులు విచారణలో తేలనున్నాయి. కాగా, ఈ ఘటనకు భద్రతా లోపమే కారణమని వీహెచ్ అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా, ఎంపీగా పనిచేసిన తనకే రక్షణ లేకుండా పోయిందని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more