ఐక్యరాజ్యసమితిలోని నాలుగు కీలక కమిటీ ఎన్నికలలో భారత్ విజయం సాధించింది. అయితే అదే సమయంలో ఈ ఎన్నికలలో పోటీ చేసిన రష్యాకు మాత్రం మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. ఐక్యరాజ్యసమితీకి చెందిన నాలుగు కమిటీల ఎన్నికల్లో పాల్గొన్న రష్యా అన్నింటిలోనూ పరాజయం పాలైంది. కాగా ఐక్యరాజ్యసమితి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సహా కమీషన్ అన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ డెవలప్ మెంట్ కమిటీలోనూ ఇకపై భారత్ గెలుపోందింది. ఇక ఐక్యరాజ్యసమితికి చెందిన ఓక ఎన్నికలో రష్యాపై ఉక్రెయిన్ విజయం సాధించింది.
ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక మండలి సంస్థలకు చెందిన నాలుకు కీలక కమిటీ ఎన్నికల్లో భారత్ విజయం సాధించింది. ఈమేరకు ఈ నాలుగు కమిటీలకు భారత్ ఎన్నికైనట్లు ఐక్యారాజ్యసమితి ఒక ట్వీట్లో తెలియజేసింది. కమీషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్, కమిటీ ఆన్ ఎన్జిఓలు, కమీషన్ ఆన్ సైన్స్ & టెక్నాలజీ ఫర్ డెవలప్మెంట్, కమిటీ ఫర్ ఎకనామిక్, సోషల్ మరియు కల్చరల్ రైట్స్ వంటివి ఇందులో ఉన్నాయి. కాగా ఇందులో భారత్ ప్రాతినిధ్యం వహించిన రాయబారి ప్రీతి సరన్తో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీకి తిరిగి ఎన్నికైంది.
ప్రపంచ దేశాలు రష్యా దాడిని సమర్ధించడం లేదనే విషయాన్ని తాజా ఫలితాలు చూపుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కమిటీ ఆఫ్ ఎన్జీఓస్, యూఎన్ వుమెన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు, యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు, పర్మినెంట్ ఫోరమ్ ఆన్ ఇండిజీనస్ ఇస్యూస్ కమిటీలకు జరిగిన ఎన్నికల్లో రష్యా పోటీ చేసింది. ఐరాస ఆర్థిక, సామాజిక మండలి ఈ ఎన్నికలను నిర్వహించింది. వీటిలో రష్యా ఓటమిని ఐరాసలో బ్రిటన్ రాయబారి వెల్లడించారు. రష్యాకు కేవలం సైనికంగానే కాకుండా ప్రపంచ దేశాల మద్దతు పరంగా కూడా ఎదురుదెబ్బలు తగులుతున్నాయని వ్యాఖ్యానించారు.
తొలి మూడు కమిటీల్లో 54 ఓట్లకుగాను రష్యాకు వరుసగా 15, 16, 17 ఓట్లు, చివరి కమిటీలో 52 ఓట్లకుగాను 18 ఓట్లు రష్యాకు వచ్చాయి. చివరి కమిటీ ఎన్నికలో ఉక్రెయిన్ 34 ఓట్లతో గెలుపొందింది. ఈ కమిటీలతో పాటు పలు ఇతర కమిటీలకు కూడా ఎన్నికలు జరిగాయి. ఐరాస ఆర్థిక సామాజిక మండలి నిర్వహించిన ఎన్నికల్లో కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్, కమిటీ ఆన్ ఎన్జీఓస్, కమిషన్ ఆన్ ఎస్అండ్టీ, కమిటీ ఫర్ ఈఎస్సీఆర్లో భారత్ గెలుపొందిందని ఐరాసలో భారత శాశ్వత రాయబారి వెల్లడించారు. చివరి కమిటీలో భారత అంబాసిడర్ ప్రీతీ శరన్ మరలా గెలుపొందారన్నారు. ఈ కమిటీలు నాలుగేళ్ల కాలపరిమితితో పనిచేస్తాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more