అడవికి సింహమే పాలకుడని చిన్నప్పటి నుంచి మనకు నేర్పుకున్నాం. అందకనే మృగరాజు అని కూడా దానిని పిలుస్తారు. అయితే అంతటి భారీ ఆకారమున్న సింహాన్ని తిట్టాలన్నా.. తలపడాలన్నా.. అందుకు సమవుజ్జీ కావాలి. కానీ చిన్ని తాబేలు సింహాన్ని ఆటపట్టించడం సాధ్యమేనా.. అదెలా సాధ్యమంటారా.? కానీ అది సాథ్యమే.. మీరెప్పుడూ చూడని ఈ దృశ్యం ఇక్కడ సాక్ష్యాత్కార్యమైంది. తాబేలు సింహానికి చికాకు తెప్పించిన హాస్యభరితమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫైనెస్ట్ ఆఫ్ వరల్డ్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు ఈ వీడియోను "గెట్ ఆఫ్ మై పాండ్" అనే సందేశంతో తమ ఖాతాకు షేర్ చేశారు.
ఓ సింహం తనకు దప్పికేసి ఓ నది ఒడ్డుకు చేరుకుని ప్రశాంతంగా నీళ్లు తాగుతున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. అకస్మాత్తుగా, ఒక తాబేలు నది నుండి బయటకు వచ్చి సింహాన్ని కలవరపెడుతుంది. దాహంతో ఉన్న సింహం ఆశ్చర్యపోయి, నీరు త్రాగడానికి తన స్థలాన్ని మార్చుకుంది. అయితే, తాబేలు మళ్లీ సింహం నోటి దగ్గరికి వచ్చింది. ఏదో తినిపించేందుకు సింహం నోటి వద్దకే చేరుకుందని అనిపించేలా వుందీ వీడియె. అయితే తినిపించడం కాదు.. సింహానికి తాబేలు చిరాకు తెప్పించింది. దీంతో మరోమారు సింహం తాను నీరు తాగే స్థలాన్ని మార్చింది.
అయినా కూర్మం మాత్రం సింహాన్ని వదిలిపెట్టలేదు. మళ్లీ అది నీరు తాగే ప్రాంతానికి చేరుకుంది. ఇలా మృగరాజును తాబేలు వేదిస్తూనే కనిపించింది. దీంతో సింహం అక్కడి నుంచి వెళ్లిపోతూనే ఉంది. అప్పుడే ఏదో జీవిని ఆరగించి దాహమేసి నది ఒడ్డకు వచ్చినట్లు సింహం. అందుకనే వేటాడే మూడ్‌లో లేడని తెలుస్తోంది. వేడి వేసవి రోజున, దాహంతో ఉన్న సింహం ఎక్కువసేపు నీరు త్రాగాలని కోరుకుంది. ఈ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడంతో ఇప్పటికే 485 వేలమంది లైక్ చేశారు.
View this post on Instagram
సోషల్ మీడియాలో ఈ వీడియోను వీక్షించిన నెటిజనులు నవ్వుకోకుండా ఉండలేరు. కోందరు ధైర్యంగల తాబేలు అంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. "తాబేలు "దయచేసి నన్ను తినగలవా, నేను జీవించి విసిగిపోయాను.. హలో సార్??" మరొకరు, "తాబేలు సింహంతో సరసాలాడడానికి ప్రయత్నిస్తోందని నేను అనుకుంటున్నాను, నా మనసు మార్చుకోండి" అని వ్యాఖ్యానించాడు. ఇంకోందర్దు ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అని సింహానికి తాబేలు తేగేసి చెప్పిందని అంటున్నారు. అడవిలోని ప్రాణులను భయపెట్టే సింహానికి తాబేలు చుక్కలు చూపించిందంటూ మరికోందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ వీడియో నాలుగేళ్ల క్రితం.. ఓ అడవిలో వైకల్యం ఉన్న ఓ శునకం.. సుఖంగా నిద్రిస్తున్న రెండు సింహాలపైకి మొరుగుతున్న ఎగబడ్డ వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. దాని వేటాడాలని ప్రయత్నించిన సింహాలకు.. ‘‘నేను గ్రామసింహాన్ని కాదు.. నేనే సింహాన్ని అంటూ శునకం చాటిచెప్పింది’’ ఆ వీడియోను వీక్షించిన నెట్ జనులు కామెంట్లు చేశారు. ఆ ఘటనను ప్రస్తుతం తాబేలు వీడియో ట్రెండ్ అవుతున్న క్రమంలో.. ఈ పాత వీడియో సైతం మళ్లీ ట్రెండింగ్‌లోకి రావడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more