దళిత బాలుడిని కొందరు యువకులు దారుణంగా కొట్టారు. అంతేగాక, ఆ బాలుడితో తమ కాళ్లు నాకించుకుని పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్మార్ట్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మైనర్ పై దాడి జరిగిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీలో జరిగింది. పదో తరగతి చదువుతున్న దళిత బాలుడిపై తమ జుళం చెలాయించారు అగ్రవర్ణాలకు చెందిన యువకులు. ఈ ఆకృత్యానికి తెగబడిన ఓ యువకుడి పోలాల్లో బాధిత బాలుడి తల్లి కూలీగా పనిచేస్తోంది.
అయితే తల్లి చెప్పడంతో వారి వద్దకు వెళ్లిన బాలుడు తన తల్లి పనికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని అడగడంతో అగ్రవర్ణాల యువకులు అతడిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ బాలుడిని మొదట బెల్టుతో కొట్టారు. ఆ తర్వాత కూడా వదిలిపెట్టకుండా కాళ్లు నాకాలని నిందితులు డిమాండ్ చేశారు. ఆ బాలుడు ఏడుస్తూ, తనను విడిచిపెట్టాలని కోరినా వినిపించుకోలేదు. ఆ సమయంలో భయపడిపోతోన్న ఆ దళిత బాలుడిని చూస్తూ అక్కడ ఉన్న ఇతరులు గట్టిగా నవ్వారు. ఇటువంటి తప్పు మరోసారి చేస్తావా? అని ఆ దళిత బాలుడిని ఆ యువకులు ప్రశ్నించారు. చేయబోనని ఆ బాలుడు కన్నీరు పెట్టుకున్నాడు.
ఆ దళిత బాలుడు స్థానికంగా గంజాయి అమ్ముతున్నట్లు అక్కడి యువకులు కొందరు ఆరోపణలు చేశారు. వాళ్లు కొట్టే దెబ్బలు తాళలేక ఆ ఆరోపణలను భయంతోనే ఆ దళిత బాలుడు అంగీకరించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ నెల 10వ తేదీన ఈ ఘటన జరిగిందని తెలిపారు. దళిత బాలుడు తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడని, అనంతరం వెంటనే నిందితులను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. దళిత బాలుడిపై ఇటువంటి దారుణానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more