జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలకు ఉగ్రమూకలకు మధ్య గురువారం నుంచి ఇవాళ్టి ఉదయం వరకు జరుగుతున్న భీకర కాల్పుల్లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూ జిల్లాలోని బారాముల్లా ప్రాంతం సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్లో భద్రతా బలగాల కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ కమాండర్ ను మట్టుబెట్టాయి. అయినా ఈ ప్రాంతంలో ఇంకా కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఇవాళ మధ్యాహ్నం మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దీంతో ఇప్పటివరకు నలుగురు ఉగ్రవాదలు హతమయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. బారాముల్లా సమీపంలోని మాల్వా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు మాల్వా ప్రాంతానికి చేరుకుని గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో భారత బద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు.. కాల్పులకు తెగబడడంతో భద్రతాదళాలు వెనువెంటనే ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో లష్కరే తోయిబా అగ్ర కమాండర్.. సుదీర్ఘకాలంగా బధ్రతా దళాలను తప్పించుకుని తిరుగుతున్న ఉగ్రవాద కమాండర్ యూసుఫ్ కంత్రూను భారత బలగాలు మట్టుబెట్టాయి.
ప్రత్యేక పోలీసు అధికారి, అతడి సోదరుడు, ఓ జవాను సహా పలువురు పౌరుల హత్యల్లో కంత్రూ ప్రమేయం ఉన్నట్టు కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఇక కంత్రూతో పాటు మరో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా, ఇవాళ కూడా కొనసాగుతున్న కాల్పుల్లో మరో ఉగ్రవాది కూడా మరణించాడని తాజాగా పోలీసులు తెలిపారు. గత 24 గంటలుగా కొనసాగుతున్న ఎన్ కౌంటర్ లో మరో ఉగ్రవాదిని మట్టుబెట్టామని పోలీసులు తెలిపారు. కాగా నిన్న ఉదయం ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు జవాన్లు స్వల్పంగా గాయపడినట్టు ఆయన పేర్కొన్నారు.
కాగా, ఏప్రిల్ 24న ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూ కశ్మీర్‌లోని సాంబా జిల్లాల్లో పర్యటించనున్నారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా జమ్మూకు 17 కిలోమీటర్ల దూరంలోని పాలి గ్రామంలో జరిగే భారీ సభలో ప్రసంగించనున్నారు. 2019లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన అనంతరం మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. అయితే మోదీ పర్యటనకు రెండు రోజుల ముందు ఇలా ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ప్రధాని మోదీ భద్రతను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more