ఏదో ఓ రోజు తనకు లాటరీ తగలకపోతుందా అని 34 ఏళ్లుగా లాటరీ టికెట్స్ కొంటున్న వ్యక్తి బంపర్ ప్రైజ్ కొట్టేశాడు. అవును కొందరి జాతకంలో అకస్మాత్తు ధనలాభం అంటూ ఉంటుంది. అంటే ఇలానే ఏదో లాటరీ రూపంలో ఏకంగా వారి ధరిద్రం తీరిపోయేలా డబ్బుల వర్షం కురుస్తుందని అర్థం. అయితే కొందరు వీటని పట్టించుకోరు. అదృష్టం ఉంటే వచ్చి తగలకుండా ఎక్కడకు పోతుంది. అప్పటివరకు మనం మన చేసుకుందాం అంటారు. అయితే కోందరు మాత్రం తాము ఏ పనిచేస్తున్నా.. తమఅదృష్టాన్ని మాత్రం అనుక్షణం పరీక్షించుకుంటూనే ఉంటారు. అలాంటి వ్యక్తి ఏకంగా రూ.2.5 కోట్ల ప్రైజ్ మనీని దక్కించుకున్నాడు. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. భటిండా జిల్లాకు చెందిన రోషన్ బట్టల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. రోషన్‌కు లాటరీ టికెట్స్ కొనడం అలవాటు.. అందులో భాగంగానే 34 ఏళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాడు. వీటిల్లో అప్పుడప్పుడూ రూ. 100, రూ. 200 ప్రైజ్‌లు వచ్చాయి. కానీ, అతడి ఆశ మాత్రం తీరలేదు. ఇలా ఎప్పుడూ లాటరీ టికెట్స్ కొనడంతో రోషన్ భార్య తరచూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసేది. ఇదిలా ఉండగా.. తాజాగా పంజాబ్ స్టేట్ డియర్ వైశాఖి బంపర్ లాటరీలో మెగా ప్రైజ్ గెలుపొందడంతో రోషన్ సింగ్ ఆనందం వ్యక్తం చేశాడు.
మొదట బంపర్ ప్రైజ్ గెలుచుకున్నట్టు రోషన్‌కు డీలర్ నుంచి ఫోన్ కాల్ రాగా అది ఫ్రాంక్ కాల్ అనుకున్నాడు. అనంతరం తాము రాంపుర ఫుల్ లాటరీ సెంటర్ నుంచి ఫోన్ చేస్తున్నామని ఏజెంట్ చెప్పడంతో ఎగిరి గంతేశాడు. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ.. లాటరీ ప్రైజ్ గెలుచుకున్నానని తెలుసుకున్న రోజు రాత్రంతా నిద్రపోలేదని తెలిపాడు. లాటరీలో వచ్చిన డబ్బులపై పన్నులన్నీ తీసాక తమకు రూ 1.75 కోట్లు వస్తాయని లెక్కలేసుకున్నానని అన్నాడు. లాటరీ మనీ మొత్తాన్ని తన ఫ్యామిలీ కోసం, కొత్త వ్యాపారం కోసం ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more