ఫోన్ మాట్లాడుతూ రోడ్డు మీద నడవడం చాలా ప్రమాదకరం. ఈ విషయం తెలిసినా.. చాలా మంది లెక్కచేయడం లేదు. ఇలా ఫోన్లో మాట్లాడుతూ ఇప్పటికే ఎన్నోఅమూల్యమైన ప్రాణాలు కూడా కాలగర్భంలో కలసిపోయాయి. ఎన్నో ప్రమాదాలకు ఇదే కారణంగా మారుతోంది. రోడ్డు దాటుతున్నా ఫోన్లో మాట్లాడటం అపకుండా.. వేగంగా వచ్చే వాహనాలు హారన్ ఇస్తున్నా పట్టించుకోకుండా.. ప్రాణాపాయ పరిస్థితుల్లోకి జారుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ.. ఫోన్లో మాట్లాడుతూ.. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయింది!
బిహార్ రాజధాని పట్నాలో జరిగింది ఈ ఘటన. ఓ వీధిలో.. మ్యాన్ హోల్ తెరిచి ఉంది. ఓ ఆటో అటువైపుగా వెళ్లింది. ఒక మహిళ కూడా ఫోన్లో మాట్లాడుతూ.. ఆటో వెనక కదిలింది. ఆ ఆటో అక్కడి నుంచి వెళ్లిపోయింది. వెంటనే తెరిచి ఉన్న మ్యాన్‌హోల్ కనిపించింది. కానీ ఫోన్లో మాట్లాడుతున్న మహిళ.. మ్యాన్‌హోల్‌ను చూడలేదు. దాని మీద కాలు వేసింది. చివరికి లోపలికి పడిపోయింది. అది గమనించిన స్థానికులు మ్యాన్హోల్వైపు పరుగులు తీశారు. మహిళను డ్రైనేజీలో నుంచి బయటకు తీసేందుకు ప్రణాళికలు వేశారు. కొద్దిసేపటికి స్థానికులు మహిళను బయటకు తీశారు.
ఈ ఘటనలో మహిళకు ఎలాంటి గాయాలు అవ్వలేదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. దృశ్యాలు వెంటనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పట్నాలోని అనేక ప్రాంతాల్లో.. నమామి గంగా ప్రాజెక్టు పనిలో భాగంగా మ్యాన్‌హోల్స్ తెరిచారు. కానీ వాటిని తిరిగి మూసివేయలేదు. ప్రమాదం జరుగుతుందని స్థానికులు ఆందోళనలు వ్యక్తం చేసినా.. అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కనీసం సిగ్నల్ బోర్డు అయినా పెట్టాలని స్థానికులు వేడుకుంటున్నారు.
पटना : फोन पर बात करते हुए गढ्ढे में समाई महिला, स्थानीय लोगों ने बचाई जान, वीडियो वायरल pic.twitter.com/B7Vn7cwjQV
— News24 (@news24tvchannel) April 22, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more