ప్రజల అరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదేనని అందుకనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన హయాంలో ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలను మరింత పకడ్బంధీగా రాష్ట్రంలో అమలు చేస్తామని అధికార వైసీపీ ప్రభుత్వం తమ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించింది. అయితే రాష్ట్రంలో అందునా టెంపుల్ సిటీ నగరంగా పేరుగాంచిన తిరుపతిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. స్థానిక అంబులెన్స్ డ్రైవర్లు కూటిమిగా ఏర్పడి అంబులెన్స్ సేవలను కూడా సామాన్యులకు అందనిద్రాక్షాగా మారుస్తున్నారు.
ఈ క్రమంలో రుయా ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఓ తండ్రి తన బిడ్డ శవాన్ని మోటార్ సైకిల్ పైనే తన స్వగ్రామానికి తరలించాల్సిన అవసరం దాపురించింది. అందుకు కారణం అంబులెన్సు డ్రైవర్లే. పెరుగుతున్న ఇంధన ధరలను సాకుగా చూపుతూ.. అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తమకు తాము చార్టుగా వేసుకుని దందా చేస్తూ పేదల రక్తాన్ని తాగుతున్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులు.. శవాలుగా ఎప్పుడు మారుతారా..? వారి నుంచి ఎలా డబ్బులు రాబడదామా.? అని శవాల మీద వ్యాపారం చేస్తూ గోతికాక నక్కల్లా మారుతున్నారని అనేందుకు ఈ ఘటనే నిదర్శనం.
కొడుకు చనిపోయిన పెట్టెడు బాధలో ఉన్న ఓ తండ్రి.. తన బిడ్డ మృతదేశాన్ని తన స్వగ్రామానికి తరలించేందుకు తన దుఃఖాన్ని దిగమింగుకుని.. ప్రయత్నించిన తండ్రికి నిరాశే ఎదురైంది. అసలే బాధతో గుండె బరువెక్కిన ఆ తండ్రిని అంబులెన్సు డ్రైవర్ల ఆగడాలు మరింత కుమిలిపోయేలా చేశాయి. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రుయా అంబులెన్సు డ్రైవర్లు.. ఏకంగా పది వేల రూపాయల చార్జీని అగడటం.. అతడ్ని తీవ్రంగా బాధించింది. కేవలం 90 కిలోమీటర్ల దూరానికి రూ.10 వేలు డిమాండ్ చేయడంతో ఆంతమేర చెల్లించలేని తండ్రి తన ద్విచక్రవాహనంపైనే తన కొడుకు మృతదేహాన్ని తరలించాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యింది.
అంతటితో ఆగని అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు.. తమ గ్రామస్థులకు ఈ సమాచారం తెలిసి.. ఉచిత అంబులెన్సు ను ఆసుపత్రికి పంపించినా.. డ్రైవర్ ను బెదిరించి తన్ని తరిమేశారు. దీంతో ఆ తండ్రి తన కన్నకొడుకు మృతదేహాన్ని విషణ్ణ వదనంతోనే బైకుపై తీసుకెళ్లాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన జైశ్వ అనే చిన్నారి ఇటీవల అనారోగ్యానికి గురికాగా.. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే మూత్రపిండాలు, కాలేయం దెబ్బతిన్నాయి. పనిచేయడం మానేశాయి. దీంతో నిన్న రాత్రి 11 గంటలకు బాలుడు కన్నుమూశాడు. అయితే, కొడుకు మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లేందుకు ఆ తండ్రి బయట ఉన్న అంబులెన్సు డ్రైవర్లను అడిగాడు.
అంబులెన్సు డ్రైవర్లు రూ.10 వేలు ఇస్తేనే వస్తామంటూ డిమాండ్ చేయడంతో తన వల్ల కాదని ఆ తండ్రి చేతులెత్తేశాడు. గ్రామంలోని బంధువులకు ఇదే విషయాన్ని చెప్పడంతో.. ఉచిత అంబులెన్సు సర్వీసును పంపారు. ఆసుపత్రికి వచ్చిన ఉచిత అంబులెన్సు డ్రైవర్ ను రుయా ఆసుపత్రి వద్ద మాఫియాగా ఏర్పడిన అంబులెన్స్ డ్రైవర్లు కొట్టారు. అక్కడి నుంచి పంపించేశారు. తమ అంబులెన్సుల్లోనే మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ అరాచకానికి తెరదీశారు. దీంతో ఆ తండ్రి చేసేదేమీ లేక బైక్ పైనే కొడుకు మృతదేహాన్ని తరలించాడు. ఇలాంటి ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయని, అయినా కూడా అంబులెన్సు డ్రైవర్ల ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
My heart aches for innocent little Jesava,who died at Tirupati’s RUIA hospital.His father pleaded with authorities to arrange an ambulance which never came.With mortuary vans lying in utter neglect,pvt ambulance providers asked a fortune to take the child home for final rites.1/2 pic.twitter.com/mcW94zrQUt
— N Chandrababu Naidu (@ncbn) April 26, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more