మౌనం వీడాలని, దేశంలో విద్వేష రాజకీయాలకు ముగింపు పలకాలని కోరుతూ 108 మంది మాజీ బ్యూరోక్రాట్లు (జాతీయ సర్వీసుల మాజీ అధికారులు) ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసాత్మక, మతోన్మాద ఘటనలకు ఇకపై స్వస్తి పలకాలని వారు లేఖలో కోరారు. ప్రస్తుతం బీజేపి పాలిత రాష్ట్రాల్లో నెలకొన్న విద్వేషపూరిత రాజకీయాలకు ముగింపు పలికాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ విలువలు దెబ్బతినేలా పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో పేట్రేగుతున్న విద్వేషపూరిత రాజకీయాలకు ముస్లింలు, ఇతర మైనార్టీలే కాకుండా రాజ్యాంగం కూడా బలవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ముప్పు అసాధారణమైనదని వారన్నారు. రాజ్యాంగ నైతికత, ప్రవర్తన ప్రమాదంలో పడింది. ఇది మన సామాజిక విశిష్టత. గొప్ప నాగరికత, వారసత్వం. రాజ్యాంగ పరిరక్షణకు విఘాతం కలిగించేలా ఉంది. ఇది చీలిపోయే ప్రమాదం నెలకొంది. ఈ అపారమైన సామాజిక ముప్పు విషయంలో మీరు పాటిస్తున్న మౌనం బధిరత్వంతో సమానం’’ అని లేఖలో వారు పేర్కొన్నారు.
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అన్న హామీని నిలబెట్టుకోవాలని వారు ప్రధానికి సూచించారు. మీ పార్టీ నియంత్రణలోని ప్రభుత్వాల పరిధిలో జరుగుతున్న విద్వేష రాజకీయాలకు ముగింపు పలకాలంటూ పిలుపు ఇవ్వాలని కోరారు. లేఖలో సంతకాలు చేసిన వారిలో దిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మేనన్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాత సింగ్, మాజీ హోంశాఖ కార్యదర్శి జీకే పిళ్లై సహా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన టీకేఏ నాయర్ ఉన్నారు.
అయితే దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తాము ప్రధాని నరేంద్రమోడీకి ఈ లేఖను రాస్తున్నామే కానీ.. ఇలా తీవ్ర విమర్శలు చేయాలన్నది తమ ఉద్దేశ్యం కాదని వారు పేర్కోన్నారు. రాజ్యంగ విలువలు దెబ్బతినేలా ప్రస్తుత పరిస్థితులు దారితీస్తున్నాయని.. వాటిని భరించలేకే తాము ప్రధానికి లేఖ రాసేలా ప్రేరేపించాయని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్, అసోం, మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా, గుజరాత్ సహా బీజేపి పాలిత రాష్ట్రాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ప్రధాని మౌనం వహించడం సరికాదన్నారు. మీరు ఇచ్చిన సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ హామీపైన నమ్మకం ఉంచి తాము ఈ లేఖను రాస్తున్నామని పేర్కోన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more