దేశంలో ఎండలు భగ్గుమంటున్నారు. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. అనేక ప్రాంతాల్లో వడగాలులు సైతం విరుచుకుపడుతున్నాయి. ఇంకా మే నెల మొదలు కాకుండానే.. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 45డిగ్రీలు దాటిపోయాయి. తెలంగాణలోని అదిలాబాద్ లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు ఒడిశాలోనూ ఎండలు దడదడలాడిస్తున్నాయి. దీనికి తోడు ఒడిశాలో వడగాల్పులు రాష్ట్రప్రజలను బయటకు రానీయకకుండా కట్టడి చేస్తున్నాయి. ఒడిశాలో హీట్‌వేవ్ కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో మరికొన్ని రోజులు పాటు ఉష్ణోగ్రతలు భారీస్థాయిలో ఉంటాయని అంచనావేసింది. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. 25నుంచి ఐదురోజుల పాటు పాఠశాలలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. కటక్, ఖుర్దా, ఆంగూల్, సబర్నపూర్, బౌద్, నయాగర్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయి. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. ప్రచండభానుడి తాపానికి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పే విధంగా తాజాగా.. ఓ వీడియో వెలుగులోకి వచ్చింది.
ఓ మహిళ.. స్టవ్ లేకుండానే, మండుటెండలో నిలిపిన కారు బానెట్‌పై చపాతీలు చేసేసింది! ఒడిశా సోనిపూర్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. నిలా మధబ్ పాండే అనే ఓ సినీ నిర్మాత.. ఈ నెల 25న ఈ వీడియోను ట్వీట్ చేశారు. 'నా సోనిపూర్లోని దృశ్యాలు ఇవి. ఎండలు ఎలా ఉన్నాయంటే.. కారు బానెట్‌పై చపాతీలు చేసేయవచ్చు,' అని క్యాప్షన్ ఇచ్చారు. వీడియోలో.. ఓ కారు కనిపిస్తుంది. ఇద్దరు మహిళలు కారు వద్ద నిలబడి ఉన్నారు. ఓ మహిళ.. పిండి తీసుకుని చపాతీలు చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత.. దానిని కారు బానెట్‌పై పెట్టింది.
స్టవ్ మీద చేసే విధంగానే గరిట పట్టుకుని చపాతీని కిందికి, పైకి తిప్పింది. కొన్ని నిమిషాల తర్వాత.. చపాతీ తయారైపోవడం గమనార్హం. ఈ వీడియోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ఆ దృశ్యాలను చూసి షాక్ అవుతున్నారు. 'వామ్మో ఎండలు', 'బయటకు వెళ్లకండి బాబోయ్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికోందరు మాత్రం గతంలో కొడిగుడ్లు అమ్లేటు అయ్యేవి.. కానీ ఇప్పుడు ఏకంగా చపాతీలే తయారవుతున్నాయ్.. ఇక మున్ముందు ఏమవుతుందో అంటూ అందోళన వ్యక్తం చేశారు. ఇక కొందరు మాత్రం ఏసీలకు అయ్యే బిల్లును గ్యాస్ రూపంలో పోదుపు చేస్తున్నారా.? అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Scenes from my town Sonepur. It’s so hot that one can make roti on the car Bonnet @NEWS7Odia #heatwaveinindia #Heatwave #Odisha pic.twitter.com/E2nwUwJ1Ub
— NILAMADHAB PANDA ନୀଳମାଧବ ପଣ୍ଡା (@nilamadhabpanda) April 25, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more