రైలు ప్రయాణికుల చివరి నిమిషంలో ప్రయాణాలతో జనరల్ టికెట్లు తీసుకుని స్లీపర్ క్లాస్ లో ప్రయాణించడం.. లేక టికెట్లు కన్ఫామ్ కాకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోని కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రయాణాలు చేస్తుంటారు. అలా స్లీపర్ క్లాస్ టికెట్లు తీసుకోకుండా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులను టార్గెట్ గా చేసుకుని వారి నుంచి అందినకాడికి దండుకుంటున్న ఘరానా మోసగాడు అదేనండీ నకిలీ టీటీఇ ఆటను ఎట్టకేలకు రాజమండ్రి రైల్వే భద్రతా సిబ్బందికి కట్టించారు. రాజమండ్రి టిక్కెట్ చెకింగ్ స్టాఫ్ చాకచక్యంగా వ్యవహరించడంతో నిందితుడి గుట్టు రట్టైంది.
టిక్కెట్ లేని ప్రయాణికులను గుర్తించేందుకు ప్రతీ రైలుతో టీటీ రైల్వేశాఖ ఏర్పాటు చేసిన స్వ్కాడ్‌లో ఆర్పిఎఫ్ కానిస్టేబుళ్లు శ్రీనివాసరావు, ప్రకాశరావు, సీనియర్ టిటిఇ రాజేంద్రప్రసాద్‌లు అలప్పుజా-ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇలా ఓ బోగీలోకి వెళ్లగానే వారికి అందులోని ప్రయాణికులు ఇప్పుడే ఓక టీటీఇ వచ్చాడుగా.. మళ్లీ వేరోకరు వచ్చారేంటి అని ప్రశ్నించారు. అయితే ఈ మాటలతో విస్మయానికి గురైన టికెట్ చెక్కింగ్ స్టాప్.. వారి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇలా టికెట్ చెక్కింగ్ చేస్తూ మరో బోగీలోకి ప్రవేశించగా వారికి మరో టిటిఇ తారసపడ్డాడు.
టిటిఇ యూనిఫాం వేసుకుని నకిలీ చలనా పుస్తకంతో రసీదులతో పాటు ఉన్న నకిలీ టీటీఇని చూసి ఆశ్చర్యపోయారు. అప్పటికే పలువురు ప్రయాణికుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తి అసలైన స్క్వాడ్‌ను చూసి ఖంగుతిన్నాడు. నెల్లూరుకు చెందిన వాయిలా వెంకటేశ్వర్లు రైల్వే టిటిఇగా చలామణి అవుతూ బోగీల్లో మోసాలు చేస్తుంటాడు. నిందితుడిపై గతంలో ఇదే తరహా కేసులు నమోదైనా తీరు మార్చుకోలేదు. వీటికి అదనంగా అపోలో ఆస్పత్రిలో డాక్టర్‌గా ఓ నకిలీ ఐడి కార్డు సృష్టించుకున్నాడు. నిందితుడ్ని పట్టుకుని ఆర్పిఎఫ్ సిబ్బంది నిలదీయడంతో అసలు గుట్టు బయటపడింది.
నిందితుడిని పట్టుకుని ద్వారపూడి రైల్వే స్టేషన్ నుంచి రాజమండ్రి తీసుకొచ్చారు. దర్యాప్తు తర్వాత రాజమండ్రి రైల్వే పోలీసులకు అప్పగించారు. నిందితుడి వద్ద అదనపు ప్రయాణ రుసము వసూలు చేసే పుస్తకం, నకిలీ ఐడి కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై విజయవాడ, చీరాల, నెల్లూరు, ఒంగోలు రైల్వే పోలీస్ స్టేషన్లలో ఇదే తరహా కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఆర్పిఎఫ్ సిబ్బంది ఫిర్యాదుతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. విజయవాడ రైల్వే ప్రత్యేక కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది. నకిలీ టిటిఇను పట్టుకున్న సిబ్బందిని రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more