సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటనలు ఈ మధ్యాకలంలో ప్రతీ రోజు జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు భద్రత కేవలం తల్లి మాత్రమేనని ఇప్పటికే పలు ఘటనలు నిరూపించాయి. తండ్రి, భర్త, సోదరులు నుంచి కూడా వారికి తగు భద్రత లభిస్తున్నా.. పలు ఘటనలు మాత్రం అక్కడా వారికి భద్రత కరువైందని తేటతెల్లం చేస్తున్నాయి. ఇక తాజాగా రాజస్థాన్లోని భరత్పూర్లో వెలుగుచూసిన ఘటనలో జీవిత భాగస్వామి అయిన భర్తే.. కట్నం కోసం ఎవరూ చేయని దారుణానికి ఒడిగట్టాడు. వరకట్న వేధింపులతో ఇంటినుంచి వెళ్లిపోయిన భార్యతను మారిన మనిషిలా తీసుకువచ్చి.. అమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
తన బంధువుల చేత అమెపై అఘాయిత్యానికి పాల్పడేలా ప్రేరేపించడంతో పాటు ఆ దృశ్యాలను తన ఫోన్లో బంధించి షోషల్ మీడియాలో పెట్టి మరీ వికృతానందం పోందాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్వాపరాల్లోకి వెళ్తే.. బాధితురాలికి 2019లో వివాహం జరిగింది. నూతన వధువుగా అత్తారింట్లో అడుగుపెట్టిన ఆమెకు నెల రోజులు బాగానే వున్నా.. ఆ వెంటనే ఆమె అత్తామామలు, భర్త.. అదనపు కట్నం కోసం వేధిస్తూనే ఉన్నారు. వారి వేధింపులు తీవ్రం కావడంతో తట్టుకోలేకపోయిన ఆ నూతన వధువు.. ఇక తాను అత్తారింట్లో ఉండలేనని భావించింది. కట్నమే ముఖ్యమని భావించిన భర్తతో తాను కాపురం చేయలేనని పుట్టింటికి వెళ్లిపోయింది.
అయితే ఇలా తన మానన తాను బతుకుతున్న భార్యపై తీవ్రమైన అక్కస్సు పెంచుకున్న అమె భర్త.. అమెకు కొన్ని రోజుల క్రితం ఫోన్ చేశాడు. అమె లేకుండా తాను ఉండేలనని నమ్మబలికాడు. ఇంటికి తిరిగి రావాలని వేడుకున్నాడు. భర్త మారిపోయాడు అని భావించి.. ఆమె అత్తారింటికి వెళ్లింది. కానీ అదే ఆమె జీవితాన్ని మార్చేసింది! భార్య ఇంట్లో ఉన్న సమయంలో.. ఆ భర్త కొందరు బంధువులను పిలిపించాడు. ఆ తర్వాత.. వారి చేత ఆమెను రేప్ చేయించాడని మహిళ ఆరోపించింది. అంతటితో ఆగకుండా.. ఆ దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించి, యూట్యూబ్లో అప్లోడ్ చేశాడని చెప్పింది.
'మీ కుటుంబం.. నాకు కట్నం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ విడియోను నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించుకుంటాను,' ఆ భర్త.. మహిళపై అరిచాడు. కొన్ని రోజులు తర్వాత.. నిందితుల్లో ఒకరు తనను వేరే ప్రాంతానికి తీసుకెళ్లినట్టు, అక్కడ తనపై మరోమారు అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు వెల్లడించింది. అక్కడి నుంచి తాను తప్పించుకుని పుట్టింటికి వెళ్లినట్టు పేర్కొంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే.. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేశారా? లేదా? అన్న విషయంపై స్పష్టత లేదని కమాన్ పోలీస్స్టేషన్ అధికారి దౌలత్ సాహు మీడియాకు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more