ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కుటుంబాలను కూడా ఒప్పించారు. ఊళ్లో పెళ్లికి అంతా సిద్ధం చేసుకున్నారు. పెళ్లి మండపానికి వెళ్లడానికి విమానం టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. కానీ ఆ విమానం ఆలస్యమైంది. ఏం చేయాలో తెలియన పరిస్థితిలో ఉన్నారు ఇద్దరు. చివరకు వాతావరణం బాగలేని కారణంగా క్యాన్సిల్ అయింది. ఏంట్రా ఈ ఖర్మ.. పెళ్లి చేసుకుని ఒక్కటి కావాలనుకున్న తమకు ఎందుకీ అవాంతరాలు ఏర్పడుతున్నాయి.. దేవుడా అంటూ ప్రార్థించారు ప్రేమికులు జెరెమీ సాల్డా, పామ్ ప్యాటర్సన్.
వీళ్లిద్దరూ అమెరికాలోని ఓక్లహామాకు చెందిన వాళ్లు. విమానం క్యాన్సిల్ అవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి జారుకుని హైరానా పడుతున్నారు. అయితే దేవుడ్ని నిండు మనస్సుతో ప్రార్థించగానే నిజంగా దేవుడు పంపించినట్టే వచ్చాడు ఒక వ్యక్తి అతనే క్రిస్. ప్రేమికుల జంటతోపాటు క్రిస్ కూడా క్యాన్సిల్ అయిన విమానం ఎక్కాల్సి ఉంది. విమానం క్యాన్సిల్ వార్త విని టెన్షన్ పడుతున్న జంట పెళ్లి దుస్తుల్లో ఉండటం చూసి ఏమైందని అడిగాడు. వాళ్ల సమస్య విన్న అతను తనకు పెళ్లి చేపించే అర్హత ఉందని, కావాలంటే సాయం చేస్తానని చెప్పాడు.
అదృష్టం కలిసొచ్చి ముగ్గురికీ ఒకే విమానంలో సీట్లు దొరికాయి. అయితే ఆ విమానం సిటీకి మరో చివర ఉంది. దాంతో ఉబెర్ టాక్సీ బుక్ చేసుకొని వేగంగా అక్కడకు చేరుకున్నారు. అయితే తాము ప్రయాణించాల్సిన విమానం రెడీగా ఉంది. దీంతో ఈ ముగ్గురు కలసి విమానం ఎక్కారు. అయితే ముహూర్త సమయం మించిపోతుందని అలోచించిన పామ్.. విమానంలోని ఫ్లైట్ అటెండెంట్ జూలీ రేనాల్డ్స్కు తమ సమస్య చెప్పింది. విమానంలోనే సరైన ముహూర్తానికి తాము పెళ్లి చేసుకుంటామని తన అభిమతం చెప్పింది. దీనికి తోడు తమ వద్ద పెళ్లి జరిపించడానికి చర్చిలో అనుమతి పొందిన క్రిస్ ఉన్నట్లు కూడా చెప్పింది.
తమ నిండు నూరేళ్ల ఆశ.. కొత్త జీవితం ప్రారంభానికి చేయాల్సిన అంకురార్పణ విమానంలోనే చేద్దామని.. అందుకు కొంచెం సహకరిస్తే చాలునని పామ్ చెప్పింది. ఇదే విషయాన్ని పైలట్‌కు చెప్పగానే అతను ‘‘ఓకే.. తప్పకుండా చేద్దాం’’ అన్నాడు. అంతే విమానం గాల్లోకి లేచిన తర్వాత 37 వేల అడుగుల ఎత్తులో పామ్, జెరెమీ సాల్డా ఇద్దరూ పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. విమానం ల్యాండ్ అయ్యాక అందరూ కలిసి ఫొటో దిగారు. అదే విమానంలో ఉన్న ఒక ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ ఈ పెళ్లి ఫొటోలు కూడా తీశాడు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Remember Chris, the ordained minister? Turns out he also works in broadcasting and was carrying on his A/V equipment! Needless to say, this special moment was captured for Pam and Jeremy to cherish forever. pic.twitter.com/hv6aGBskSm
— Southwest Airlines (@SouthwestAir) April 30, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more