నాది నాది నాది అని ఆశపడతావు.. కానీ నీది కాదు అన్న నిజం తెలిసి బాధపడతావు.. అన్న పాత సినిమా పాట గుర్తుందా.? సరిగ్గా అలాగే ఉంది ఇక్కడ ఈ వ్యక్తి పరిస్థితి. నిత్యం బిజీగా మారిన జీవనంతో కాసింత రిలాక్స్ అవుదామని బీచ్ కు వెళ్లాడు. అయితే అందుకు గాను అంతా సిద్దం చేసుకున్నాడు. బీచ్ ఒడ్డున స్విమ్మింగ్ పూల్ కు పైన ఓ చివర ఉన్న ఓ ఏరియల్ సీటును ఎంచుకుని దానిపై తాను టవల్ కూడా వేసి.. ఆ తరువాత హాయిగా సేద తీరుతున్నాడు. ఇంతలో ఏ సముద్రపుటంచు నుంచి చూసిందో కానీ.. తాను అలా సేద తీరాలని భావించింది.
అంతే ఇంకేముందు ఏకంగా సముద్రం నుంచి బయటకు వచ్చేసింది. నేరుగా బీచ్ లో ఏర్పాటు చేసిన మెట్ల నుంచి కొంచెం నెమ్మదిగా నడుస్తూ వచ్చింది. వచ్చీ రావడంతో తోటే కాసింత కష్టమవుతుందని బావించిందో ఏమో తన సహజత్వాన్ని ఇముడ్చుకుని మళ్లీ స్విమ్మింగ్ పూల్ లోకి దూకింది. ఈత కొట్టింది.. అలా ఒక్కసారిగా బయటకు వచ్చింది. నేరుగా బీచ్ ఒడ్డును ఏరియల్ వ్యూ చూస్తూ.. కూర్చున్న మనిషి వద్దకు చేరుకుంది. తీరా దీని రాకను చూసిన బీచ్ లో సేద తీరుదామనుకున్న వ్యక్తి వెంటనే లేచి నిలబడ్డాడు. ఇక తన సీటును ఇది ఆక్రమిస్తోందని తెలిసిన తరువాత తన సీటుపై తాను పరుచుకున్న టవల్ కూడా లాగేసుకుని అలా పక్కకు వెళ్లి నిలబడ్డాడు.
అంతేగా మారి ఏమీ చేయలేని పరిస్థితుల్లో,. చూస్తూ ఉండటం కన్నా ఏం చేయగలం. అయితే హాయిగా బీచ్ లో సేద తీరుదామని వచ్చిన వ్యక్తి సీటును అక్రమించి నిలబడేలా చేసింది ఎవరు.? తెలుసా. సముద్రపు సింహం. అదేనండీ సీ లయన్. సీ లయన్స్ అంటే సీల్స్ మాదిరిగానే ఉన్నా వాటికన్నా ఆకారంలో కాసింత పెద్దవి. ఇవి భూమిపై కూడా నడవగలవు. ఈ సీ లయన్ ను చూసిన బీచ్ లవర్ .. విలాసవంతమైన కుర్చీలోంచి లేచి పక్కన నిలబడటంతో.. అనుకున్నదోక్కటి.. అయినది ఒక్కటీ బొల్తా కోట్టిందిలే బుల్ బుల్ పిట్టా అన్న పాటను గుర్తుచేసుకుంటున్నారు జంతు ప్రేమికులు. పడుకున్నాడు.
అంతేగా మరి ఒక్కోసారి మనది అనుకుని ఏన్నో ఏర్పాట్లు చేసుకుంటాం..కానీ.. అది మనకు అందినట్టుగానే అంది.. చేజారి పోతుంది. ఈ విషయంలో బాగా అనుభవజ్ఞులు అంటే రాజకీయ నేతలే. తమకు పార్టీ టిక్కెట్ అందినట్టే అంది.. దూరం కావడం.. పదవులు కూడా అందినట్టే అంది చేజారడం కామన్. వాళ్లూ మాత్రం ఏం చేస్తారు.. నిలబడి వేడుక చూడటం.. సమయం కోసం వేచిచూడటం తప్ప.. అలాగే ఈ వ్యక్తి పరిస్థితి కూడా తారుమారైంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాలో ‘వైరల్‌హగ్’ పేజీ అప్‌లోడ్ చేసింది. ఈక్వెడార్‌లోని గాలాపాగోస్ దీవుల్లోని బీచ్‌సైడ్ రిసార్ట్‌లో ఈ సంఘటన జరిగింది. ఇప్పటివరకూ ఈ వీడియోకు 13వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
View this post on Instagram
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more