ఎక్కడపడితే అక్కడ కామవాంఛ తీర్చుకోడానికి మనం మనుషులం కాదు. అందరి పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు.. మరీ మావాడేంట్రా అంటే.. చదవు సంథ్యలు వదిలేసి.. పిచ్చి తిరుగుళ్లు తిరుగుతున్నాడు అని భవిష్యత్తులో బాధపడేకంటే.. వయస్సులో ఉన్నప్పుడు ఎక్కడ చేయాల్సిన పనులు అక్కడ చేస్తే బాగుంటుంది. కమల్ హాసన్ నటించిన ఆకలి రాజ్యం సినిమాలో సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్.. రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే.. బ్రదరూ.. అని సాగే పాటలో.. కవి చెప్పినట్టు.. ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా? ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా.. అని పెద్దయ్యాక పిల్లలు అనుకునే బదులు.. నియంత్రణలో ఉంటేనే అందరీకీ మంచిది.
ఇప్పుడీ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటారా.? హైదరాబాద్ నగరం నడిబోడ్డున అద్దె ఇళ్ల కోసం తిరుగుతున్న ఓ జంట.. నియంత్రణ కోల్పోయి చేసిన పని గురించి తెలిస్తే మీరు కూడా మంచీ చెడు గురించి తప్పక చెబుతారు. సాధారణంగా ఇల్లు అద్దెకు కావాలనుకునే వారు ఎక్కడైనా టు-లెట్ బోర్డు కనిపిస్తే, ఆ ఇంటి యజమానిని అడిగి వివరాలు తెలుసుకోవడం సహజం. ఇంట్లోకి ప్రవేశించి తమ అవసరాలకు అనుగుణంగా అక్కడి ఏర్పాట్లు ఉన్నాయా? తమ వద్ద ఉన్న సామాగ్రికి ఆ ఇళ్లు పరిపోతుందా.? లేదా? అని పరిశీలించడం సాధారణ విషయం. కానీ అమీర్ పేట పరిధిలో ఇళ్లు కోసం వెతికిన జంట.. ఇళ్లు కనబడగానే.. వారి శారీరిక అవసరమే ముందుగా గుర్తుకోచ్చింది.
అమీర్ పేట పరిధిలోని బీకే గూడలో అద్దె ఇంటి కోసం బైక్ పై ఓ జంట వెతుకుతోంది. వారికి బైటు-లెట్ బోర్డు తగిలించి ఉన్న ఇళ్లు కనబడింది. యువతి, యువకుడు ఇద్దరూ ఆ బైక్ దిగి.. ఇంటి వివరాలు తెలుసుకునేందుకు ఇంటి యజమానిని కలిశారు. ఇల్లు అద్దెకు కావాలని.. అద్దె ఎంత అని అడిగారు. పై పోర్షన్ ఖాళీగా ఉందని ఇంటి యజమాని చెప్పడంతో తమకు సరిపోతుందో లేదో చూస్తామని వారిద్దరూ పైకి వెళ్లారు. అయితే, ఇళ్లు చూస్తామన్నవారు ఎంతకీ కిందికి రాకపోవడంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి.. ఆయన కూడా పై పోర్షన్ కు వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన యువతి, యువకుడు రాసలీలల్లో మునిగి తేలుతున్నారు. దాంతో ఇంటి యజమాని విస్మాయనికి గురై.. వారిపై ఆగ్రహంతో కేకలు వేయగా, వారిద్దరూ అక్కడ్నించి ఉడాయించారు. యువతి రోడ్డుపై పరుగులు తీయగా, యువకుడు తన బైక్ పై హడావుడిగా వెళ్లిపోయిన వైనం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లోనూ దర్శనమిచ్చాయి. కాగా, జరిగిన ఘటనపై ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజిని కూడా పోలీసులకు అందించారు. ఏదేమైనా ఇలాంటి ఘటన పట్ల పోలీసులు కూడా ఆశ్చర్యపోయినట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more