బీహార్‌లోని సుల్తాన్ గంజ్‌లోని గంగా నదిపై నిర్మిస్తున్న ఓ బ్రిడ్జ్ కుప్పకూలింది. అయితే బ్రిడ్జి కూలిపోడానికి కారణం ఏంటన్న నివేదికను అధికారులు ఏకంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి పంపారు. ఆయన ఈ నివేదికను చూసి విస్మయానికి గురయ్యారు. ఏదో గ్రామస్థాయి అధికారులో లేక మండలస్థాయి అధికారులో కాదు ఏకంగా బ్యూరోక్రాట్ గా పిలువబడే ఐఏఎస్ అధికారి ఇచ్చిన నివేదిక ఇది. ఈ నివేదికలో గంగానదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి కూలిపోవడానికి గల కారణం తెలుసుకున్న కేంద్రమంత్రి అవ్వాకయ్యారు. అయితే ఈ విషయాన్ని ఆయన ఎక్కడ ప్రస్తావించాలో అక్కడ ప్రస్తావించడంతో అదికాస్తా ఇప్పుడు వైరల్ న్యూస్ గా మారింది.
సుల్తాన్‌గంజ్ జిల్లాలో భగల్పూర్, ఖగాలియాలను కలుపుతూ గంగానదిపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు. రూ. 1710 కోట్ల అంచనా వ్యయంతో 2014లో దీన్ని ప్రారంభించారు. 2019 ఈ నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా, కరోనా సహా వివిధ కారణాల వల్ల అది ఆలస్యమవుతోంది. దీనికి కారణాలను కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆరా తీశారు. వంతెన కూలడానికి కారణమేంటని ఐఏఎస్ ఆధికారైన తన కార్యదర్శిని అడిగారు. దానికి ఆ సెక్రటరీ సమాధానమిస్తూ.. ఆ సమయంలో వర్షం పడుతోందని, గట్టిగా గాలులు వీస్తున్నాయని, దాంతో నిర్మాణంలో ఉన్న ఆ వంతెనలో కొంత భాగం కూలిపోయిందని నివేదికలో పేర్కోన్నారని తెలిపారు.
దీంతో విస్మయానికి గురైన ఇయన ఆశ్చర్యాన్ని వ్యక్తపర్చారు. అయితే ఈ బ్రిడ్జి విషయాన్ని అంతటితో వదలని మంత్రి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆహుతులతో విషయాన్ని పంచుకున్నారు. వర్షం, బలమైన గాలులు వీస్తే బ్రిడ్జ్ ఎలా కూలుతుందో అర్థం కావడం లేదని మంత్రి అన్నారు. ఒక ఐఏఎస్ అధికారి ఇలా కూడా సమాధానమిస్తారా? గట్టిగా గాలులు వీస్తే.. కాంక్రిట్ నిర్మాణం కూలిపోతుందా?`అని ప్రశ్నించారు. ఈ బ్రడ్జి కూలిపోవడానికి నిర్మాణ లోపాలే కారణమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. 1710 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ నిర్మాణం 2014లో చేపట్టగా.. 2019లో పూర్తికావాల్సివుంది. కానీ కరోనా సహా పలు కారణాలతో ఆలస్యమైంది. బ్రిడ్జి ఏకంగా 3116 మీటర్లు పొడుగు ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more