Hmda Notification For Rajiv Swagruha Flats రాజీవ్ స్వగృహా ఫ్లాట్ల అమ్మకం.. రేపట్నించే ధరఖాస్తుల ఆహ్వానం..

Rajiv swagruha flats up for auction in hyderabad s pocharam bandlaguda

Hyderabad Metropolitan Development Authority (HMDA), hmda lands, HMDA Rajiv Swagruha Flats, HMDA Rajiv Satbhavana Township, housing board colony, rajiv swagruha complex Bandlaguda, Pocharam, Swagruha Flats Pocharam, Swagruha Flats Bandlaguda, Rajiv Swagruha Flats Bandlaguda, Rajiv Swagruha Flats Pocharam, Telangana, Politics

The Hyderabad Metropolitan Development Authority (HMDA) has decided to take over the Rajiv Swagruha Corporation Limited from the Housing Board and sell the flats to generate revenue. As a pilot project, it will auction 28 blocks of the Rajiv Swagruha complex at Bandlaguda. Based on the outcome, it would sell the remaining flats, numbering about 10,000. Builders can take up minor patchworks and resell the flats to buyers.

రాజీవ్ స్వగృహా ఫ్లాట్ల అమ్మకం.. రేపట్నించే ధరఖాస్తుల ఆహ్వానం..

Posted: 05/11/2022 04:59 PM IST
Rajiv swagruha flats up for auction in hyderabad s pocharam bandlaguda

హైదరాబాద్‌లో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునేవారికి హెచ్‌ఎండీఏ కల్పిస్తున్నది. ఆదాయార్జనలో హైదరాబాద్ అర్భన్ డెవలెప్ మెంట్ అథారిటీతో పోటీ పడేందుకు సన్నధం అవుతోంది. నగర శివార్లలోని (రంగారెడ్డి జిల్లా) బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ కాంప్లెక్సుల్లోని సద్భావనా టౌన్షిప్ లలోని ఫ్లాట్లను అమ్మకానికి పెట్టింది. కాంగ్రెస్ హయాంలో నిర్మాణం ప్రారంభమైన ఈ స్వగృహా ఇళ్లను అప్పటి ప్రభుత్వం ఎంతో పట్టుదలతో నిర్మాణం చేసింది. ఇక తీరా ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకునే క్రమంలో ఎన్నికలు వచ్చాయి.

ఆ తరువాత రాష్ట్ర విభజన అల్లర్లు తారాస్థాయికి చేరడంతో ఈ స్వగృహ నిర్మాణపనులకు తీవ్ర ఆటకం ఏర్పడింది. గత ఏడాది వరకు ఈ ఫ్లాట్లను అలానే వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఏడాది క్రితం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరికలతో దిగివచ్చిందో.. లేక నిధుల లేమిని అధిగమించే ప్రయత్నాలలో భాగంగా ఈ చర్యకు పూనుకుందో తెలియదు కానీ రాజీవ్ స్వగృహా ఫూడ్స్ సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం బండ్లగూడలోని రాజీవ్ స్వగృహా ప్లాట్లలో 419 ఫ్లాట్లు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయి. మరో 1082 ఫ్లాట్లలో పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పూర్తిగా సిద్ధమైన ఫ్లాట్ల ధరను చదరపు అడుగుకు రూ.3 వేలు, సెమీ ఫినిష్‌డ్ చదరపు అడుగుకి రూ.2,750గా నిర్ణయించింది.

ఇక పోచారంలో 1,328 ఫ్లాట్లు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాయి. మరో 142 ఫ్లాట్లలో స్వల్పంగా పనులు మిగిలి ఉన్నాయి. పూర్తయిన ఫ్లాట్ల ధరను చదరపు అడుగుకు రూ.2,500గా, సెమీ ఫినిష్‌డ్ చదరపు అడుగుకు రూ.2,250గా నిర్ణయించారు. గురువారం నుంచి జూన్‌ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసక్తి కలిగినవారు మీ సేవ పోర్టల్‌, కంప్యూటర్ ఆధారిత లాటరీ ద్వారా ఫ్లాట్లను కేటాయిస్తారు. రేపట్నుంచి జూన్ 14 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తుకు అవకాశం ఉంది. మీ సేవ పోర్టల్, స్వగృహ వెబ్‌సైట్, మొబైల్‌యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత లాటరీ ద్వారా వచ్చే నెల 22న ఫ్లాట్లను కేటాయించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HMDA  Rajiv Swagruha Flats  HMDA Rajiv Satbhavana Township  Bandlaguda  Pocharam  Telangana  Politics  

Other Articles