హృద్రోగులకు మరో మంచి శుభవార్తను అందించింది జైడస్ లైఫ్ సెన్సెస్ సంస్థ. హృద్రోగాలకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్.. రక్తనాళాలో పేరుకుపోయి.. గుండెపోటుతో పాటు హృద్రోగ సంబంధిత రోగాలకు కూడా దారి తీస్తోంది. ఈ చెడు కొలస్ట్రాల్ నుంచి విముక్తి పోందేందుకు జైడస్ లైఫ్ సైన్సెస్ సంస్థ మరో నూతన ఔషదాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచేందుకు బెమ్డాక్ బ్రాండ్ పేరుతో బెమ్పెడోయిక్ యాసిడ్ డ్రగ్‌ను మార్కెట్లోకి తెచ్చినట్టు తాజాగా జైడస్ లైఫ్ సైన్సెస్ సంస్థ శుక్రవారం వెల్లడించింది.
బెమ్డాక్ ఒక కొత్త తరగతికి చెందిన డ్రగ్ అని, జీవనశైలి సరిచేసుకుంటున్నప్పటికీ, గరిష్ఠంగా సహించగలిగే మోతాదులో స్టాటిన్స్ డోస్ తీసుకుంటున్నప్పటికీ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో లేనిపక్షంలో ఈ డ్రగ్ ద్వారా నియంత్రించవచ్చని సంస్థ తెలిపింది. ఇది నోటి ద్వారా తీసుకునే డ్రగ్ అని వివరించింది. ‘బెమ్డాక్ను ప్రవేశపెట్టడం మాకు సంతోషాన్నిస్తోంది. అదుపులో లేని ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నియంత్రించగలిగే మెడిసిన్ ద్వారా ఓ పరిష్కారాన్ని చూపుతున్నందుకు ఆనందంగా ఉంది..’ అని జైడస్ లైఫ్ సైన్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ శార్విల్ పటేల్ అన్నారు.
డిస్లిపిడెమియా, కొలెస్ట్రాల్ నియంత్రణలకు ఔషధాన్ని తేవడం ద్వారా జైడస్ పోర్ట్‌ఫోలియోలో ముఖ్యమైన ఔషధాలు చేరినట్టయిందని పటేల్ తెలిపారు. ప్రభావవంతమైన వ్యాధి నియంత్రణతో ప్రజలు నాణ్యమైన జీవితాన్ని పొందడానికి తమ మిషన్ ఉపయోగపడుతుందని అన్నారు.ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌ను సాధారణంగా బ్యాడ్ కొలెస్ట్రాల్‌గా పిలుస్తారని, ఇది రక్తనాళాల గోడలకు పేరుకుపోతుందని, గుండెపోటు, స్ట్రోక్ తదితర అనారోగ్య సమస్యలు వచ్చే రిస్క్‌ను పెంచుతుందని కంపెనీ తెలిపింది. నియంత్రణ లేని ఎల్డీఎల్.. కార్డియోవాస్కులర్ సంబంధిత రోగాలను తయారవడంలో మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అని తెలిపింది.
ప్రతి పది మంది భారతీయుల్లో 8 మంది డిస్లిపిడెమిక్తో బాధపడుతున్నారని, 112 మిలియన్ల మేర వయోజనులు హైలెవల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారని జైడస్ పలు అధ్యయనాలను ఉటంకించింది. ప్రతి 10 మంది డిస్లిపిడెమియా పేషెంట్లలో ఏడుగురు అదుపులో లేని ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌తో బాధపడుతున్నారని తెలిపింది. దేశంలో 5.4 మిలియన్ల మందికి స్టాటిన్ థెరపీ సానుకూలంగా లేదని కూడా తెలిపింది. బెమ్పెడోయిక్ యాసిడ్ స్టాటిన్స్ పడని పేషెంట్లలో, స్టాటిన్స్‌కు స్పందించని పేషెంట్లలో కూడా మంచి ఫలితాలను ఇచ్చిందని జైడస్ తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more