పెళ్లంటే నూరేళ్ల పంట. ఎవరి జీవితంలోనైనా కేవలం ఒక్కసారి మాత్రమే జరిగే మహావేడుక. అప్పటివరకు ఒకరికి ఒకరు తెలియకుండానే.. ఒక్కటై.. ఓకరికి ఒకరై.. జీవితాంతం తోడుగా ఉండే చక్కని బంధం. కష్టనష్టాలలో.. ఇష్టాయిష్టాలలో.. త్యాగనిరతిని పెనవేసుకునే బహుచక్కని బంధం. అలాంటి బంధాన్ని అందరూ అపురూపంగా కాపాడుకుంటారు. కానీ కోందరు పెళ్లి అనే బంధాన్ని కూడా మోసంతో ముడివేస్తున్నారు. పెళ్లి పేరిట 100 మంది మహిళలను మోసం చేసిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఫర్హాన్ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి నుంచి ఓ బీఎండబ్ల్యూ కారు.. ఏటీఎంలు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఓ మ్యాట్రిమోనియల్ పోర్టల్‌లో తాను ఓ వ్యక్తిని కలిశానని తాను ఓ అవివాహితుడనని చెప్పున్న ఆ వ్యక్తి.. బిజినెస్ డీల్ పేరిట ఆమె నుంచి రూ.15లక్షలు దోపిడీ చేశాడని ఏయిమ్స్‌కు చెందిన ఓ వైద్యురాలు సౌత్ ఢిల్లీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన ఫర్హాన్ మ్యాట్రిమోనియల్ సైట్లలో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి.. వర్కింగ్ మహిళలను లక్ష్యంగా చేసుకునేవాడు. నిందితుడు చదివింది కేవలం ఇంటర్మీడియట్ మాత్రమేనని.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు.
తన తల్లిదండ్రులు చనిపోయారని మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలలో పేర్కొన్న నిందితుడు.. వాటి ద్వారా అవివాహిత యువతులను లక్ష్యంగా చేసుకుని వారిని సంప్రదించి, వారితో ఎంతో కలవిడిగా, నిర్మోహమాటంగా మాట్లాడేవాడు. ఆ తర్వాత వారు తన ట్రాప్ లో పడ్డారని తెలుసుకున్న తరువాత.. వారికి ఏవో సాకులు చెప్పి.. వారి నుంచి డబ్బులు తీసుకోనే వాడు. అలాగే ఎయిమ్స్ చెందిన మహిళా వైద్యరాలిని సైతం మోసం చేయగా.. సదరు మహిళ మార్చి 26న పోలీసులకు ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. అయితే అంతకుముందు ఎందరినో మోసం చేసినా.. కోందరు తప్ప మిగతావారందరూ నిమ్మకుండిపోయారు.
అయితే వైద్యురాలి ఫిర్యాదు మేరకు డీసీపీ బెనిటా మేరి ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 18 రోజుల పాటు బృందం కష్టపడి నిందితుడిని పట్టుకుంది. సదరు వ్యక్తి పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఒడిశా, కర్నాటకతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన మహిళలను మోసం చేసినట్లు పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా ఫర్హాన్ మహిళలను మోసం చేస్తున్నాడని చెప్పారు. తనకు వ్యాపారాలు ఉన్నాయని, ఎంబీఏ, ఇంజినీరింగ్ చదివినట్లు మహిళలకు చెప్పి వారిని నమ్మించే వాడని ఆ తర్వాత వారి నుంచి డబ్బులు వసూలు చేశాక వారితో సంబంధాలను కట్ చేసుకునేవాడని వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more