మద్యం సీసా వాసన చూస్తేనే ఒక చిత్రంలో హీరోకు కిక్కు ఎక్కుతుంది. ఇక అదే సరిస్థితి ఇప్పుడు తాజాగా మందుబాులకు కలుగుతుంది. ఔనా అంటారా.. మద్యం కొనుగోలు చేయడం విసయం పక్కనబెడితే.. మద్యందుకాణాలకు వెళ్లి వాటిని ఖరీదు ఎంత అని అడిగితే చాలు.. మందుబాబులకు కిక్కు ఎక్కడం గ్యారంటీ. ఎందుకంటే.. తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెంచుతూ.. కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అసలే ధనిక రాష్ట్రం అని గోప్పలు చెప్పుకున అధికార పార్టీ నేతలకు.. ధనం సమృద్దిగా లేదని మద్యం బాబులను టార్గెట్ చేసిందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అయ్యేలా చేసింది.
ఇప్పటికే అర్టీసీ చార్జీలను పెంచిన ప్రభుత్వం, మరోవైపు విద్యుత్ చార్జీలను కూడా పెంచింది. ఇక తాజాగా మద్యం బాబులను కూడా టార్గెట్ చేసింది. బీరు సీసాల నుంచి క్వార్టర్, ఫుల్ సీసాల వరకు అన్ని రకాల మద్యంపై ధరలన కూడా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన మద్యం ధరలు ఈ నెల 19 నుంచి అంటే.. గురవారం నుంచే అమల్లోకి వస్తాయి. మద్యం దుకాణాల్లో బుధవారం అమ్మకాలు పూర్తి కాగానే అబ్కారీ అధికారులు మద్యం సీజ్ చేశారు. ఆ తర్వాత నిల్వలు లెక్కిస్తారు. అనంతరం గురువారం నుంచి.. పెరిగిన ధరల ప్రకారం విక్రయించేలా చర్యలు తీసుకుంటారు.
ఒక్కో బీరు, క్వార్టర్ పై రూ.20 పెంటినట్టుగా తెలుస్తోంది. ఫుల్ బాటిల్ పై రూ.80 పెంచారు. ఇటీవలే.. ఆబ్కారీ శాఖ ఎండాకాలంలో మద్యం ఎంత తాగారో లెక్కలు ప్రకటించింది. తెలంగాణలో ఎప్పుడూ లేనంతగా.. బీర్లు అమ్మకాలు పెరిగాయి. ఆ లెక్కలు చూసుకుంటే..మార్చి నుంచి మే 14 వరకు అంటే 75 రోజుల్లో రూ.6,702 కోట్ల విలువైన బీర్లు తాగారు. అంటే.. 10.64 కోట్ల లీటర్ల బీర్లు అన్నమాట. 6.44 కోట్ల లీటర్ల లిక్కర్‌ను మద్యం ప్రియులు లాగించేశారు. ఈ రెండింటినీ పోల్చుకుంటే.. సుమారు 4 కోట్ల లీటర్ల బీరు ఎక్కువగా కుమ్మేశారు.
ఈ ధరలను చూసుకుంటే.. గతేడాది, అంతకుముందు ఏడాది కంటే అధికం. విపరీతంగా బీర్ల అమ్మకాలు పెరిగాయి. 75 రోజుల్లో రూ.6,702 కోట్ల బీర్లు తాగేశారంటే ఒక్కసారి ఆలోచించండి. మందు బాబులు చల్లని బీరు గొంతులో ఎలా పోస్తున్నారో తెలుస్తుంది. గతంలో చల్లటివి తాగితే.. కరోనా వస్తుందనే భయంతో చాలామంది బీర్లకు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. దీంతో ఎగబడి మారి.. బీర్లు తాగుతున్నారు. పెళ్లిల్లు, పార్టీలు ఇలా అంతటా చల్లని బీర్లే గొంతులో పోస్తున్నారు. తాగేవాళ్లు ఏ ఇద్దరూ కలిసినా.. నాలుగు బీర్లు తెచ్చుకుని.. చెరో రెండు లాగించేస్తున్నారు.
వేసవి మెుదలైనప్పటి నుంచి రంగారెడ్డి జిల్లాలో అధికంగా 2.38 కోట్ల లీటర్ల బీర్లు తాగారు. తర్వాతి స్థానంలో వరంగల్ జిల్లా ఉంది. ఇక్కడ కోటి 15 లక్షల బీర్లు తాగారు. ఖమ్మం జిల్లాలో మాత్రం లిక్కర్ అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో కోటి 7 లక్షలు లీటర్లు, కరీంనగర్ జిల్లాలో కోటి 6 లక్షలు లీటర్లు, మెదక్ జిల్లాలో 92.44 లక్షలు బీర్లు తాగేశారు. హైదరాబాద్ జిల్లాలో 87.49 లక్షల లీటర్లు, మహబూబ్ నగర్ జిల్లాలో 81.22 లక్షల లీటర్లు, ఖమ్మం కేవలం 40.53 లక్షలు లీటర్ల బీర్ల అమ్మకాలు జరిగాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more