గతవారం పెళ్లికుమారుడు వధువు మెడలో తాళి కట్టే సమయంలో వధువు తనకు పెళ్లి ఇష్టం లేదంటూ.. చెప్పడంతో.. వరుడు పెళ్లిపీటలపైనే సృహకోల్పోయిన ఘటన ఒడిశా రాష్ట్రంలో బాలసోర్ జిల్లాలో జరిగింది. దీంతో వధువు తరపు కుటుంబసభ్యులు, బంధువులు అమెను చితక్కోట్టి.. ఈ విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదని నిలదీసిన విషయం కూడా నెట్టింట్లో వైరల్ అయ్యింది. సరిగ్గా అలేగే మరో జంట.. అదేనండీ ఇద్దరు మనుషులు ఒక్కట్టైయ్యే బ్రహ్మముహూర్తానికి ఇంకా రెండు నిమిషాలే ఉంది. అదే సమయంలో వధువు మెడలో వరుడు తాళి కట్టాల్సి ఉంది. ఇంతలో పెళ్లికూతురు కళ్లు తిరిగి పడిపోయింది.
సొమ్మసిల్లి పడిపోయిన వధువును అమె తరపు బంధువులు వెంటనే ముఖంపై నీళ్లు చల్లి కూర్చోబెట్టారు. సరేలే అలాగే కళ్యాణ కార్యక్రమంలోని అసలైన ఘట్టాన్ని పూర్తిచేద్దామని పెళ్లి పెద్దలు భావిస్తారు. పురోహితుడు కూడా మాంగళ్యం అంటూ తాళి కట్టే మంత్రాన్ని ప్రారంభించగా.. వరుడు తాళి కట్టేందుకు తన స్థానంలోంచి లేచి నిలబడి.. వధువు మెడలోకి తాళిని తీసుకెళ్లగా.. వధువు గట్టిగా వీల్లేదు.. నేను ఈ పెళ్లి చేసుకోను.. అని మొండికేసింది. ఔరా.. పెళ్లిపీటలమీద పెళ్లిని ఎందుకు వద్దంటోందని అక్కడున్నవారంతా విస్మయానికి గురయ్యారు. ఈ విడ్డూరం మైసూరు నగరంలోని విద్యాభారతి కళ్యాణ మండపంలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. హెచ్డీ కోటెకు చెందిన యువకునితో మైసూరుకు చెందిన సించన అనే యువతికి పెద్దలు ఇటీవలే నిశ్చితార్థం చేశారు. కాగా, పెళ్లివేడుకలో తాళి కట్టే సమయానికి వధువు తొలుత సృహ కోల్పోయింది. ఆ వెంటనే కోలుకున్నా.. తనకు వివాహం ఇష్టం లేదని.. వరుడికి చెప్పింది. అంతేకాదు తన తల్లిదండ్రులకు, బంధువర్గానికి కూడా చెప్పింది. అయినా సరే అంటూ కుటుంబసభ్యులు, బంధుజనం అమెను సముదాయించేందుకు ప్రయత్నించారు. అయినా తాను ఈ పెళ్లి చేసుకోను అని నిర్మోహమాటంగా చెప్పేసింది. దీంతో కథ అడ్డం తిరిగింది.
అయితే కారణమేంటని ఆరా తీయగా, ఇంటి పక్కన ఉన్న యువకున్ని తాను ప్రేమించానని, అతనితోనే మూడుముళ్లు వేసుకుంటానని చెప్పడంతో వధూవరుల తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇదిలాఉండగా, చివరిక్షణంలో పెళ్లి వద్దంటే ఎలా?, తాము ఈ పెళ్లి కోసం రూ. 5 లక్షలకు పైగా ఖర్చు చేశామని, తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పెళ్లకొడుకు తల్లిదండ్రులు పట్టుబట్టారు. దీంతో, విషయం కాస్తా పోలీసులకు చేరింది. వారు వచ్చి సముదాయించినా వదువు పెళ్లిక అంగీకరించలేదు. దీతో అమెను పోలీసు రక్షణ మధ్య స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఎవరు చెప్పినా వినేది లేదని, ప్రేమించినవాడినే పెళ్లి చేసుకుంటానని పెళ్లికూతురు భీష్మించడంతో ఖాకీలు సైతం ఏమీ చేయలేకపోయారు.
Bride refuses to marry at the last minute- says 'No' to the groom on the wedding day, and leaves the marriage hall with police protection. The incident happened at #Mysuru #Karnataka.@KeypadGuerilla Video pic.twitter.com/wlwc0bZ2qO
— Siraj Noorani (@sirajnoorani) May 22, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more